Begin typing your search above and press return to search.

వ‌ర్షంలో హీరో అంతిమ‌యాత్ర‌!

By:  Tupaki Desk   |   23 Dec 2018 4:38 AM GMT
వ‌ర్షంలో హీరో అంతిమ‌యాత్ర‌!
X
ఆంధ్రుల అందగాడు శోభ‌న్ బాబు మ‌ర‌ణం - అనంత‌రం జ‌రిగిన కొన్ని స‌న్నివేశాల‌ గురించి ర‌చ‌యిత‌ ప‌రుచూరి గోపాల‌కృష్ణ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేశారు. తాను బ‌తికి ఉన్నంత‌కాలం హీరోగానే ఉంటాన‌ని ప్ర‌క‌టించిన శోభ‌న్ బాబు కెరీర్ చివ‌రి నాళ్ల‌లో అస‌లు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. ఎవ‌రైనా ఆఫ‌ర్ చేసినా ససేమిరా అంటూ తిర‌స్క‌రించేవారు. చెన్న‌య్‌ లో నివాసం ఉండేవారు. ఓ రోజు హ‌ఠాత్తుగా ఆయ‌న మ‌ర‌ణం గురించి వార్త వెలువ‌డింది. ఆరోజు జోరున వ‌ర్షం కురుస్తోంది. ఆ వ‌ర్షంలోనే అంతిమ యాత్ర‌ను సాగించారు. న‌టుడిగా ఎన్నో ఏళ్ల గ్యాప్ వ‌చ్చింది. అస‌లు ఎవ‌రైనా వ‌స్తారా? అనుకున్నాం. కానీ అంత‌టి పెను తుఫాన్‌ లోనూ ఆయ‌న అంతిమ‌యాత్ర‌కు ఊక వేస్తే రాల‌నంత మంది అభిమానులు హాజ‌ర‌య్యారు. ఆ దృశ్యాల్ని టీవీల్లో చూసిన వారంతా షాక‌య్యారు. అస‌లు ఒక హీరోకి అంత లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇంత‌ గొప్ప అభిమానులు ఉంటార‌న్న‌ది ఊహించ‌లేనిది.. అని అన్నారు ప‌రుచూరి. శోభ‌న్ బాబు అవార్డుల ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తెలియ‌జేశారు.

అంద‌గాడు శోభ‌న్‌బాబు అవార్డుల వేడుక‌ ఈనెల 25న హైద‌రాబాద్ ఎన్‌-క‌న్వెన్ష‌న్‌ లో జ‌ర‌గ‌నుంది. అఖిల భారత శోభన్‌ బాబు సేవా సమితి ఆధ్వ‌ర్యంలో శోభ‌న్‌ బాబు అభిమాన సంఘాలు ఈ వేడుక‌ల్ని నిర్వ‌హిస్తున్నాయి. ఈసారి అవార్డులు ఆస‌క్తిక‌రం. రెబ‌ల్‌ స్టార్‌ కృష్ణంరాజుకు ప్రసాద్ ల్యాబ్స్ అధినేత ఎ.రమేష్ ప్రసాద్ చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారారాన్ని అందించ‌నున్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో పేరుగాంచిన నటీనటులు - దర్శకనిర్మాతలు - సంగీత దర్శకులకు శోభన్‌ బాబు ఎవర్‌ గ్రీన్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డులు అందుకునే వారిలో కె.రాఘవేంద్రరావు - సి.అశ్వినీదత్ - కె.బ్రహ్మానందం - ప్రకాశ్‌ రాజ్ - రోజా - బి.సత్యానంద్ - ఎస్.గోపాలరెడ్డి - దేవిశ్రీప్రసాద్ పేర్లు ఉన్నాయి.

శోభ‌న్‌ బాబు అవార్డులు అందుకునే జాబితా ఇలా ఉంది. ఉత్తమ చారిత్రక చిత్రం- గౌతమిపుత్ర శాతకర్ణి - ఉత్తమ జానపద చిత్రం- బాహుబలి - ఉత్తమ సాంఘిక చిత్రం - ఖైదీ నంబర్ 150 - ఉత్తమ ప్రేమకథా చిత్రం- అర్జున్‌ రెడ్డి - ఉత్తమ కుటుంబ కథా చిత్రం- శతమానం భవతి ఎంపిక‌య్యాయి. మహానుభావుడు చిత్రానికి జూరీ అవార్డును అందిస్తున్నారు. ఈ అవార్డుల కార్యక్రమానికి మరపురాని కథానాయికలుగా సీనియర్ నటీమణులు జయచిత్ర - సరిత - భానుప్రియ ప్రత్యేకంగా హాజరవుతారు. ఈ ఫంక్షన్‌కి ఆత్మీయ అతిథులుగా మురళీమోహన్ - గిరిబాబు - వి.విజయేంద్రప్రసాద్ - తెలంగాణ ఎఫ్‌డిసి ఛైర్మన్ రామ్మోహన్‌ రావు - ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి.కళ్యాణ్ - మా అధ్యక్షుడు శివాజీరాజా - సెక్రటరీ నరేశ్ హాజరు కానున్నారు.