Begin typing your search above and press return to search.

చావంటే భయంలేదన్న సైరా

By:  Tupaki Desk   |   23 Aug 2018 6:16 AM GMT
చావంటే భయంలేదన్న సైరా
X
రాయలసీమకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో రూపొందిన సైరా టీజర్ వచ్చాక అంచనాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. నిమిషం టీజరే అయినప్పటికీ దాని గురించిన చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. మెగా ఫాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇక 12 ఏళ్ళ తమ సుదీర్ఘ నిరీక్షణకు శుభం పలుకుతూ ఇన్నాళ్లకు ఇది తెరకెక్కడం పట్ల పరుచూరి బ్రదర్స్ ఆనందం మాములుగా లేదు. అది వారి మాటల్లో బయటపడిపోతోంది కూడా. ఎప్పుడో రాసుకున్న స్క్రిప్ట్ ని ఎన్నోసార్లు చిరుతో చేయాలని ప్రయత్నించి ఇప్పటికి సఫలం చేసుకున్న ఈ సోదరులు ఇందులో ఓ కీలకమైన డైలాగ్ బయట పెట్టడం అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తోంది. చేతులు విరిచేశాం-ముఖం ముందు ఉరితాడు ఉంది-ఏంట్రా ఆ ధైర్యం అని బ్రిటిషర్ అంటే చచ్చి పుట్టిన వాడిని చనిపోయిన తరువాత కూడా బ్రతికే వాడిని చావంటే నాకెందురా భయం అంటూ చిరు బదులిచ్చే సీన్ ఓ రేంజ్ లో ఉంటుందని ఊరిస్తున్నారు పరుచూరి గోపాకృష్ణ. ఇలా లీక్ చేసినందుకు చిరు కోపగించుకున్నా పర్వాలేదని చెప్పిన ఆయన ఎంత ఊహించుకున్నా అంతకు మించి సైరా ఉంటుందనే భరోసా ఇస్తున్నారు.

స్క్రిప్ట్ డెవలప్ చేసింది పరుచూరి బ్రదర్స్ అయినప్పటికీ సంభాషణలు సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు. పైన చెప్పిన డైలాగ్ ఎవరు రాసారో చెప్పలేదు కానీ ఫాన్స్ మాత్రం ఇది కదా చిరు నోటి వెంట రావాల్సిన డైలాగ్ అంటూ సంబరపడిపోతున్నారు. సైరా కథలో కోట గుమ్మానికి ఆయన్ను ఉరి వేసే ఎపిసోడ్ చాలా కీలకం. ఇప్పుడు పరుచూరి వారు చెప్పింది కూడా ఆ సందర్భంలోనే ఉండే అవకాశం ఉంది. ఎమోషనల్ సన్నివేశాలను తనదైన శైలిలో రక్తి కట్టించే మెగాస్టార్ చాలా కాలం తర్వాత ఇంత బరువైన సీన్ ని చేస్తున్నారు. తన కెరీర్ లో చాలా తక్కువ సినిమాల్లో యాంటీ క్లైమాక్స్ ఉన్న సినిమాలు చేసిన చిరంజీవి ఇది నిజ కథ ఆధారంగా చేసుకున్న సమర యోధుడి సినిమా కావడంతో మార్పులు లేకుండా యధాతధంగా తీస్తున్నారు. గతంలో ఠాగూర్ క్లైమాక్స్ ని ఊరి తీసే సీన్ తో ముగించాలనుకుని తర్వాత అభిమానులు ఒప్పుకోరని డ్రాప్ అయ్యారు. కానీ సైరా విషయంలో ఆ ఇబ్బంది వచ్చే అవకాశం లేదు కాబట్టి రోమాంచితమైన ఉరి సన్నివేశం గురించి అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానులు