Begin typing your search above and press return to search.

ముఠామేస్ర్తీ ని త‌ల‌పించిన మాస్ వీర‌య్య

By:  Tupaki Desk   |   20 Nov 2022 12:27 PM GMT
ముఠామేస్ర్తీ ని త‌ల‌పించిన మాస్ వీర‌య్య
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో `వాల్తేరు వీర‌య్య` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా ప‌క్కా మాస్ కంటెంట్ అని తేలిపోయింది. వీర‌య్య విశ్వ‌రూపం ఎలా ఉండ‌బోతుంది? అన్న ఎగ్జైట్ మెంట్ అప్పుడే అభిమానుల్లో మొద‌లైంది. స్టార్ మేక‌ర్ బాబి బాస్ ని ఎంతో అభిమానించి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి.

మాస్ బాస్ ని త‌న‌దైన శైలిలో వెండి తెర‌పై ఆవిష్క‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే టీజ‌ర్ తో ఫ్యాన్స్ లో పూన‌కాలు తెప్పించారు. లాంగ్ షార్ట్ లో చిరు ఎలాంటి మాస్ పాత్ర పోషిస్తున్నారు? అన్న‌ది రివీల్ చేసారు. తాజాగా మ్యూజిక్ ట్రీట్ కి రెడీ అవుతోన్న నేప‌థ్యంలో మెగాస్టార్ కొత్త పోస్ట‌ర్ ఒక‌టి రిలీజ్ చేసారు. ఇందులో చిరంజీవిని ఆద్యంతం మాస్ లుక్ లో దించేసారు.

మ‌ల్టీక‌ల‌ర్ లుంగీలో... ఆ లుంగీ పై లోప‌ల టీష‌ర్ట్ ఆపైన మెరుపుల చొక్కా చూస్తేనే వీర‌య్య‌ని ఎంత మాస్ గా సాంగ్ లో హైలైట్ చేసార‌న్న‌ది అద్దం ప‌డుతుంది. చేతికి వాచీ.....కాళ్ల‌కి న‌ల్ల బూట్లు.. మెడ‌లో బంగారు గొలుసుల తో చిరంజీవి మాస్ వీర‌య్య‌ని త‌ల‌పిస్త‌న్నారు. టోట‌ల్ గా చిరంజీవి మ‌రో ముఠామేస్ర్తి పి...రిక్షావోడు త‌ర‌హాలో మాస్ బాస్ గా హైలైట్ అవుతున్నారు.

చిరంజీవిని ఇలాంటి లుక్ లోచూసి సంవ‌త్స‌రాలు అవుతుంది. కంబ్యాక్ త‌ర్వాత పూర్తిగా సాప్ట్ క‌థల్నే ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అంత‌కు ముందు తొమ్మిదేళ్ల గ్యాప్ ఇలా అన్నిమెగాస్టార్ ని మాస్ ఆడియ‌న్స్ కి దూరం చేసాయి. ఇప్పుడా బాధ్య‌త‌లు బాబి తీసుకుని మ‌ళ్లీ పాత‌ చిరంజీని చూపిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

మొద‌టి లిరిక‌ల్ సాంగ్ నే `బాస్ పార్టీ` తో మొద‌లు పెడుతున్నారు. ఈనెల 23న సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఈ పాట‌ని రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవి ఆహార్యానికి త‌గ్గ‌ట్లు బాస్ మాస్ స్టెప్పులు దించేయ‌డం ఖాయం. ఆయ‌న ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు పార్టీ సాంగ్ ని అంత‌కంత‌కు మాస్ ఆడియ‌న్స్ లో కి దూసుకుపోయేలా దేవి శ్రీ ప్ర‌సాద్ మాస్ ట్యూన్స్ అందిస్తారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే పాట‌లో హాట్ బ్యూటీ ఊర్వీశి రౌతేలా మెరుపులు హైలైట్ కానున్నాయి. ఈ పాట కోసం బాలీవుడ్ నుంచి ఏరికోరి మ‌రి అమ్మ‌డిని దిగుమ‌తి చేసారు. ఈపాట‌ని శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేసారు. ఈసినిమాలో చిరంజీవికి జోడీగా శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది.