Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ వద్దు బాబోయ్ అంటున్నారట

By:  Tupaki Desk   |   20 Jun 2017 11:39 AM GMT
బిగ్ బాస్ వద్దు బాబోయ్ అంటున్నారట
X
దేశవ్యాప్తంగా సెన్సేషన్స్ క్రియేట్ చేసిన టీవీ షో బిగ్ బాస్.. ఇప్పుడు తెలుగులో వచ్చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తుండగా.. తెలుగు బుల్లితెరపై ఇది వివాదాస్పద కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బిగ్ బాస్ షోను తెలుగులోనే నిర్వహించనున్నా.. దీన్ని హిందీ ఎపిసోడ్స్ కోసం నిర్మించిన సెట్స్ లోనే చిత్రీకరించనుండడంతో.. ఫ్లేవర్ అంతా అక్కడిదే ఉంటుందని అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టిసిపెంట్స్ ఎంపిక జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అందరూ సెలబ్రిటీలనే భాగం చేస్తారని చెప్పచ్చు. ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా అందుతున్నాయట. ఇందులో భాగంగా ఓ సీనియర్ హీరో కూతురుకు ఇన్విటేషన్ అందగా.. ఆయన నుంచి తిరస్కారం వచ్చిందట. అలాగే హీరోయిన్ అయేందుకు ప్రయత్నిస్తున్న ఓ డైరెక్టర్ కూతురుకు కూడా బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ ఆ డైరెక్టర్ కూడా ఈ పిలుపును తీవ్రంగా ఖండించాడట.

టాలీవుడ్ స్టార్స్ ఎవరూ తమ వారసులను తెలుగు బిగ్ బాస్ లో పాల్గొనేందుకు దాదాపుగా అనుమతించడం లేదని తెలుస్తోంది. హిందీ బిగ్ బాస్ షో నడిచినపుడు సన్నీ లియోన్.. రాఖీ సావంత్.. తనీషా ముఖర్జీ వంటి వారు చేసిన రచ్చ.. గొడవలు అందరికీ తెలిసిందే. అక్కడ ఇచ్చే టాస్క్ లు కూడా ఇలాగే ఉంటాయి. అయితే.. కెరీర్ లో ఇబ్బంది పడుతున్న పలువురు చిన్న హీరో హీరోయిన్లు మాత్రం బిగ్ బాస్ నుంచి పిలుపు కోసం ఆత్రంగా ఎదురుచూస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/