Begin typing your search above and press return to search.

పాప్ రారాజు కూతురు వీరంగం

By:  Tupaki Desk   |   16 May 2017 10:13 AM GMT
పాప్ రారాజు కూతురు వీరంగం
X
పాప్ ప్రపంచపు తిరుగులేని రారాజు మైఖేల్ జాక్సన్. ఆయన కూతురు పారిస్ జాక్సన్ తన పాటల సంగతేమో కాని.. సెక్సీ లుక్స్ తో మాత్రం రచ్చ చేస్తుంటుంది. కైపెక్కించే ఫోటోలతో అందరినీ మంత్ర ముగ్ధులు చేస్తోంది. అందంతో పాటుగా సిద్ధాంతాలును చెప్పే ఫిలాసఫర్ గా తయాఐంది. మైఖేల్ చనిపోయిన కొద్ది రోజులుకు పారిస్ జాక్సన్ తన అక్కౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేసి మైఖేల్ జాక్సన్ ఇంకా మా చుట్టుతే ఉన్నారిని ఒక సంచలన సృష్టించింది. ఇప్పుడు మరోసారి తన న్యూడ్ పిక్ తో అటువంటి సెన్సేషనే క్రియేట్ చేస్తోందీ అమ్మడు.

అర్ధ నగ్నంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి పెట్టి.. చేతిలో సిగరెట్ ఒకటి పట్టుకొని.. ఇదే నా ఫ్రీడంను చెప్పే పద్దతి అంటూ పాప ప్రకటించింది. నుడిటీ అంటే సెక్స్ కాదని.. నేచర్లోకి మనం వెళ్లడానికి ఒకదారి అని చెబుతోంది. నేను గార్డెనింగ్ చేస్తున్నప్పుడు బట్టలు ఏవి లేకుండా చేస్తాను.. స్త్రీవాదం అంటే మనకు నచ్చినట్టు ఉండటం మనం అనుకున్నది చెప్పడంతో పాటు మన శరీరాన్ని పూజించడం కూడా.. అంటూ.. ఇలా ఆరుబయట కూర్చొని కాఫి తాగుతూ సిగరెట్ కాల్చుతు తనను ఫాలో అవుతున్న జనానికి హితబోద చేసింది పారిస్.

మన తప్పులును ఒప్పుకొనే దమ్ము ఉండాలి అంటా మన తప్పులు నుండి మనం నేర్చుకోవాలి అప్పుడే మనం మనుషులం అవుతాం అని చెబుతోంది. ఈ పిల్ల కూడా వాళ్ళ నాన్నలానే ఉంది ఏది పడితే అది చేయడం మళ్ళీ తప్పు నుండి నేను నేర్చుకున్నా అని ప్రపంచానికి చెప్పడం చేస్తున్నట్లుంది కదూ!? ఇప్పుడు పారిస్ జాక్సన్ లాస్ ఏంజలెస్ లో నటిగా ప్రయత్నాలు చేస్తోంది. తండ్రి నుండి గాత్రం రాకపోయినా జీవితంను పిచ్చిగా ఎంజాయ్ చేయడం బాగానే నేర్చుకుంది పాప్ రారాజు ముద్దుల కూతురు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/