Begin typing your search above and press return to search.

జాక్సన్ కూతురు పొడిపించేసుకుంది

By:  Tupaki Desk   |   5 Sept 2017 10:18 PM IST
జాక్సన్ కూతురు పొడిపించేసుకుంది
X
ప్రపంచం మొత్తం ఆరాధించే డ్యాన్సింగ్ గాడ్ మైకేల్ జాక్సన్ ఇప్పుడు మన మధ్య లేడు. అయితే.. ఆయన సృష్టించిన సంచలనాలు మాత్రం ఎప్పటికీ చెదరనివే. అలాంటి మహానుభావుడి కూతురు కావడంతో.. పారిస్ జాక్సన్ కు అనతి కాలంలోనే ఫుల్లు పాపులారిటీ వచ్చేసింది. పైగా ఈ అమ్మడు అందాల ప్రదర్శనలో టాప్ రేంజ్ హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేస్తుండడంతో.. మరీ త్వరత్వరగా జనాలకు నోటీస్ అయిపోయింది.

అందంలో ఓ మాత్రం వంక పెట్టేందుకు లేని ఈ భామ.. ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలకు తెర తీస్తూనే ఉంటుంది. అలాగని ఇంకా స్టార్ స్టేటస్ సంపాదించకపోయినా.. కేవలం తన అందాలనే పెట్టుబడిగా చేసి పేరు సంపాదించేస్తోంది. రీసెంట్ గా ఈ వయ్యారి.. తను కొత్తగా వేయించుకున్న ట్యాటూను జనాలకు చూపించేందుకు ఫిక్స్ అయిపోయి.. క్లీవేజ్ షో చేసి పారేసింది. దీన్ని చూపించేందుకు టాప్ లెస్ గా పోజులు ఇచ్చేందుకు కూడా ఏ మాత్రం సంశయించలేదు జాక్సన్ డాటర్. ట్యాటూ కోసం ఇంతకు తెగించాలా అనుకోవచ్చు కానీ.. ఇదేమీ అలాంటి ఇలాంటి ట్యాటూ కాదు.

సప్త చక్రాలను తన ఛాతీ భాగం నుంచి ఉదరంపై వరకు పచ్చ పొడిపించేసుకుంది. ఇవేంటంటే.. మూలాధార.. స్వాధిష్ఠాన.. నాభి-మణిపుర.. అనహత.. విశుద్ధి.. ఆజ్జ.. సహస్రార చక్రాలు.. వెన్నెముకపై కింద నుంచి పైకి ఉంటాయని బౌద్ధులు.. హిందువులు విశ్వసిస్తారు. వీటినే తన శరీరంపై ట్యాటూగా వేయించుకుని.. సప్త చక్రాలకు ఒక్కసారిగా క్రేజ్ తెచ్చేసింది పారిస్ జాక్సన్.