Begin typing your search above and press return to search.

'నా నాజూకు నడుమే.. నాకిష్టం' అంటున్న బ్యూటీ

By:  Tupaki Desk   |   16 May 2020 6:00 AM IST
నా నాజూకు నడుమే.. నాకిష్టం అంటున్న బ్యూటీ
X
అందాల తార పరిణీతి చోప్రా. ప్రియాంక చోప్రా చెల్లెలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి పట్టా పొందిన పరిణితి.. స్టడీస్ అవ్వగానే యశ్ రాజ్ ఫిలిమ్స్ లో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ గా ఉద్యోగంలో చేరింది. 2011లో అదే సంస్థ నిర్మించిన 'లేడీస్ వర్సెస్ రికీ బౌల్' సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో తనను తను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక 2012లో ఇషాక్ జాదే.. 2013లో శుద్ధ్ దేశి రొమాన్స్.. 2014లో హసీ తో ఫసీ.. ఇలా వరుస విజయాలతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ఇషాక్ జాదే, శుద్ధ్ దేశి రొమాన్స్ మూవీస్ లో అమ్మడి రొమాన్స్ మాములుగా ఉండదు. నిజంగానే ముద్దులతో, బెడ్ సీన్స్ తో రెచ్చిపోయింది. పరిణితి అందాల ఆరబోతకు కుర్రకారు మతులు పోగొట్టుకున్నారు అంటే అతిశయోక్తి కాదు.

కానీ ఎంత గ్లామర్ షో చేసినా ఈ ముద్దుగుమ్మ మాత్రం ప్రియాంక స్థాయిని అందుకోలేక పోయింది. కానీ నటిగా మాత్రం ఓ మంచి పేరు తెచ్చుకుంది. వరుస హిట్ల తర్వాత అమ్మడికి అవకాశాలు రావడం తగ్గిపోయింది. ఎందుకంటే బాగా లావుగా బొద్దుగా తయారయింది. బాలీవుడ్‌లో శరీరాకృతి నాజూగ్గా ఉంటేనే అవకాశాలు దక్కుతాయి. అదే, దక్షిణ చిత్ర పరిశ్రమల్లో బొద్దుగా ఉంటే అవకాశాలకు కొదవ ఉండదు. వర్కౌట్లు బాగానే చేసి నడుమును అందంగా నాజూగ్గా మార్చుకొంది. మొత్తంగా శరీరాకృతినే మార్చేసుకొని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది గుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీ శరీరంలో మీకు నచ్చే భాగం ఏదంటే.. మాత్రం సంకోచించకుండా ‘నా నడుమే. చాలా నాజూగ్గా ఉంటుందని బోల్డ్‌గా చెప్పేస్తుంది. ఇక అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయర్స్ బాగానే ఉన్నారు. వారికోసం రెగ్యులర్ గా తన అందాల పోస్ట్ పెడుతూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో వరుసగా ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు కలలరాణిగా తన నడుము అందాలతో.. బిగువైన ఒంపుసొంపులతో పిచ్చేక్కిస్తుంది..