Begin typing your search above and press return to search.

ఇదేం ట్విస్టు: పెళ్ల‌యి పిల్ల‌లున్న‌ హీరోపై మోజు ప‌డ్డ హాటీ

By:  Tupaki Desk   |   22 Oct 2020 12:00 PM IST
ఇదేం ట్విస్టు: పెళ్ల‌యి పిల్ల‌లున్న‌ హీరోపై మోజు ప‌డ్డ హాటీ
X
ఆ స్టార్ హీరోకి పెళ్ల‌య్యింది. ఒక‌సారి కాదు .. రెండుసార్లు. మొదటి భార్య‌కు ఇద్ద‌రు ఎదిగేసిన పిల్ల‌లున్నారు. రెండో భార్య‌కు ఒక బిడ్డ జ‌న్మించాడు. రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు. అయితే పెళ్ల‌యి పిల్ల‌లు ఉన్నా అత‌డంటే పడి చ‌స్తాన‌ని టెంప్ట్ చేస్తోంది ఆ యంగ్ బ్యూటీ. ఈ ఎపిసోడ్ లో ఆ హీరో ఎవ‌రు? హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది ఆరా తీస్తే. ఆ హీరో సైఫ్ అలీఖాన్. ఆ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా.

పరిణీతి చోప్రా అలియాస్ పారి ఈ రోజు తన 32 వ పుట్టినరోజు జరుపుకుంటోంది. హసీ తోహ్ ఫేసీ స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన ఈ అమ్మడు సోష‌ల్ మీడియాల్లో భారీ అభిమానులను కలిగి ఉన్న సంగ‌తి తెలిసిన‌దే. పారి ఓకే అనాలే కానీ పెళ్లాడేందుకు సిద్ధ‌మేన‌నే బోయ్స్ కోకొల్ల‌లు. కానీ ఆమె సైఫ్ అలీ ఖాన్ ని తప్ప మరెవరినీ ఇష్ట‌ప‌డ‌ద‌ట‌. అతనితో ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకుంది.

తన తాజా చిత్రం జబారియా జోడి ప్రమోషన్ కోసం పరిణీతి కోస్టార్ సిదార్థ్ మల్హోత్రాతో `ది కపిల్ శర్మ షో` కోసం విచ్చేసింది. వధువు కుటుంబం నుండి కట్నం కోరే మ‌గాడిని బ‌ల‌వంతంగా లేపుకెళ్లి పెళ్లాడే అమ్మాయి పాత్ర‌లో న‌టించింది ప‌రిణీతి. ఒక‌వేళ అదే నిజ జీవితంలోనూ చేయాల‌నుకుంటే .. ఏ హీరోతో చేస్తావు? అని ప్ర‌శ్నించారు క‌పిల్ శ‌ర్మ‌. దానికి పారి ఏమాత్రం త‌డుముకోకుండా సైఫ్ ఖాన్ పేరు చెప్పేసింది.

ఈ చిత్రం యొక్క ఇతివృత్తం ప్రకారం.. హోస్ట్ కపిల్ శర్మ నిజ జీవితంలో ఒక వ్యక్తిని అపహరించడానికి అవకాశం ఇస్తే తాను ఎవరిని అపహరిస్తానని పరిణీతిని అడిగారు. ఆమె బదుట్ మార్ పాడ్నే వాలి హై (నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను) అని సమాధానం ఇచ్చింది. ఒకరిని కలవడానికి నాకు అవకాశం రాకపోతే .. నేను అతన్ని కిడ్నాప్ చేయవలసి వస్తే,.. అది సైఫ్ అలీ ఖాన్. అంటూ ట్విస్టిచ్చింది. నేను సైఫ్ ను చాలా ప్రేమిస్తున్నానని కరీనాకు ఇప్పటికే చెప్పాను. ఆమె దానికి సరే. నేను అతన్ని అపహరించుకుంటాను. నేను ఈ ప్రేమను కొంత దూరం నుండి కొనసాగిస్తాను.. ఓకేనా అని క‌పిల్ శ‌ర్మ‌తో అంది ప‌రిణీతి.