Begin typing your search above and press return to search.

18 ఏళ్లకు మొదటి ముద్దు.. డేటింగ్‌ పై ఓపెన్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   2 March 2021 10:00 AM IST
18 ఏళ్లకు మొదటి ముద్దు.. డేటింగ్‌ పై ఓపెన్‌ అయ్యింది
X
బాలీవుడ్‌ హాట్‌ అండ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న పరిణితి చోప్రా ఇటీవల ది గర్ల్‌ ఆన్ ది ట్రైన్ సినిమాలో నటించింది. ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా పరిణితి చోప్రా గత వారం పది రోజులుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియా లో యాక్టివ్ ఉంటూ వచ్చింది. ఇటీవల నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే కార్యక్రమం డూ యూ రిమెంబర్‌ అనే ఛాలెంజ్ లో భాగంగా స్పీడ్ గా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఆ సమయంలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.

ర్యాఫిడ్ ఫైర్‌ రౌండ్ మాదిరిగా చకచక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. మీ మొదటి కిస్ ఎప్పుడు అంటూ ప్రశ్నించిన సమయంలో నేను 18వ ఏట ఉన్న సమయంలో మొదటి కిస్‌ అనుభవం దక్కింది అంది. ఇప్పటి వరకు తాను ఎవరితో కూడా డేట్‌ కు వెళ్లలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. టీనేజ్ లో తనకు సైఫ్‌ అలీ ఖాన్ అంటే విపరీతమైన ఇష్టం అంటూ చెప్పుకొచ్చిన పరిణితి తన మొదటి సినిమా విడుదల అయిన సమయంలో ఒక అభిమాని ఇచ్చిన బుక్‌ నాకు ఎంతో ఆనందంను కలిగించిందని చెప్పుకొచ్చింది. ఆ పుస్తకంలో అన్ని ప్రేమ లేఖలే ఉన్నాయి. అతడు నాకు రాసిన ఆ లేఖలు ఎప్పటికి మర్చి పోలేని విధంగా నిలిచాయి అంది.