Begin typing your search above and press return to search.

ఐదేళ్లుగా అసంతృప్తిలో ఉన్నాను.. అయిష్టంగానే సినిమాలు చేస్తున్నా: హీరోయిన్ హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   8 Jun 2021 8:00 AM IST
ఐదేళ్లుగా అసంతృప్తిలో ఉన్నాను.. అయిష్టంగానే సినిమాలు చేస్తున్నా: హీరోయిన్ హాట్ కామెంట్స్
X
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పరిణీతి చోప్రా.. గురించి గ్లామర్ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలోకి ప్రియాంక చోప్రా చెల్లెలిగా అరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి పట్టా పొంది.. చదువు అయిపోగానే యశ్ రాజ్ ఫిలిమ్స్ లో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంటుగా పనిచేసింది. అలా 2011లో అదే సంస్థ నిర్మించిన 'లేడీస్ వర్సెస్ రికీ బౌల్' సినిమాతో హీరోయిన్ అయింది. డెబ్యూ మూవీతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు అందుకుంది పరిణితి. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో 2012లో ఇషాక్ జాదే.. 2013లో శుద్ధ్ దేశి రొమాన్స్.. 2014లో హసీ తో ఫసీ.. ఇలా వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అప్పట్లో ఇషాక్ జాదే, శుద్ధ్ దేశి రొమాన్స్ మూవీస్ లో పరిణితి రొమాన్స్ తో యువతలో వేడి పుట్టించిందనే చెప్పాలి. ఘాటు ముద్దులతో, బెడ్ సీన్స్ తో రెచ్చిపోయింది. పరిణితి అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. కానీ ఎంత గ్లామర్ ఒలికించినా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్స్ లో చేరలేకపోయింది. కానీ నటిగా మాత్రం ఓ మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది పరిణితి నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ - సందీప్ ఔర్ పింకీ ఫెరార్ - సైనా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కెరీర్ ప్రారంభించి పదేళ్లు పూర్తి కావడంతో అమ్మడు తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తన మనసులో మాటలు బయటపెట్టింది.

గత ఐదేళ్లలో పరిణితి తన సినిమాలు వర్క్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది. బ్యాడ్ ఫిల్మ్ అని తెలిసి కూడా తాను నటించిన సందర్భాలు ఉన్నాయని చెప్పింది అమ్మడు. తాజాగా ఓ పేపర్ ఇంటర్వ్యూలో.. "అవును ఐదేళ్లలో చాలా సినిమాలు సన్నివేశాలు అసంతృప్తి పరిచాయి. నా పని పరంగా నేను 'అన్ హ్యాపీ'గా ఉన్నాను. నా మీద నాకు నమ్మకం ఉన్నా మేకర్స్ మాత్రం నేను ఆశించిన క్యారెక్టర్ సీన్స్ ఇవ్వరు. చాలా సినిమాలకు నేను అయిష్టంగానే సంతకం చేసాను. ఇప్పుడు కూడా అలాంటి సినిమాలకు సంతకాలు చేస్తూ అన్ హ్యాపీగానే ఉన్నాను. కానీ నేను అమోల్ గుప్తే (సైనా), దిబాకర్ బెనర్జీ (సందీప్ P ర్ పింకీ ఫరార్) అలాగే రిభు దాస్‌గుప్తా (ది గర్ల్ ఆన్ ది ట్రైన్) మూవీస్ దర్శకులకు మాత్రం ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని చెప్పుకొచ్చింది పరిణితి. ప్రస్తుతం అమ్మడు రణబీర్ కపూర్ సరసన 'అనిమల్' సినిమా చేస్తోంది.