Begin typing your search above and press return to search.

‘యానిమల్’ సరసన పరిణీతి.. క్యారెక్టర్ ఇదేనట!

By:  Tupaki Desk   |   2 Jan 2021 6:00 PM IST
‘యానిమల్’ సరసన పరిణీతి.. క్యారెక్టర్ ఇదేనట!
X
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యావత్ దేశ సినీ ఇండస్ట్రీల చూపును తనవైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి. ఇదే కథను హిందీలోనూ ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి, అక్కడ కూడా సక్సెస్ రిపీట్ చేశాడు. దీంతో.. బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు సందీప్. షాహిద్ కపూర్-కియారా అద్వానీతో రీమేక్ చేసిన ‘కబీర్ సింగ్’ బాలీవుడ్ లో దుమ్ములేపింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 278.24 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో.. బాలీవుడ్ స్టార్స్ సందీప్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ హీరోగా ఓ ప్రాజెక్టు ప్రకటించాడు సందీప్.

‘యానిమల్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో.. రణబీర్ సరసన హీరోయిన్ కోసం కొంత కాలంగా వెతుకుతున్నాడు డైరెక్టర్. ఎంతో మంది స్టార్ హీరోయిన్లను సంప్రదించినా.. ఎవ్వరూ ఓకే చెప్పలేదట! చివరకు తాను చేస్తానంటూ ముందుకొచ్చిందట బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా.

మరి, ‘యానిమల్’ రణబీర్ సరసన నటించేందుకు హీరోయిన్లందరూ ఎందుకు అంగీకరించలేదు అంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యే ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు నో చెప్పారట కొందరు బ్యూటీస్. అయితే.. ఈ మధ్యన పెద్ద మూవీ దేనికీ సైన్ చేయలేదు పరిణీతి. అందుకే ఈ మూవీకి ఓకే చెప్పేసిందని టాక్.

కాగా.. నూతన సంవత్సర సందర్భంగా ‘యానిమల్’ టైటిల్ మోషన్ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో అనిల్ కపూర్ తోపాటు బాబీ డియోల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ కేతాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.