Begin typing your search above and press return to search.

రణ్ బీర్ సినిమా అందుకే వదులుకున్నా అంటున్న పరిణీతి చోప్రా..!

By:  Tupaki Desk   |   23 Oct 2022 5:00 AM IST
రణ్ బీర్ సినిమా అందుకే వదులుకున్నా అంటున్న పరిణీతి చోప్రా..!
X
లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చోప్రా ఫ్యామిలీ హీరోయిన్ పరిణీతి చోప్రా మొదటి సినిమా హిట్ అందుకోగా ఆ తర్వాత ఇషక్ జాదే.. శుద్ దేసి రొమాన్స్ ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో మెప్పించింది. కెరియర్ మొదట్లోనే స్టార్ రేంజ్ కి వెళ్లిన అమ్మడు ఆ తర్వాత ఎందుకో డీలా పడ్డది. వరుసగా సినిమాల్లో నటిస్తున్నా సరే పరిణీతి చోప్రా కెరియర్ ఆశించినంత స్థాయిలో మాత్రం లేదని చెప్పొచ్చు. అసలే కెరియర్ కష్టంగా నడుస్తున్న ఈ టైం లో స్టార్ హీరో సినిమా ఛాన్స్ వచ్చినా సరే కాదనేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, సందీప్ వంగ డైరక్షన్ లో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో ముందుగా పరిణీతినే హీరోయిన్ గా అనుకున్నారట కానీ అమ్మడు మాత్రం ఆ ఆఫర్ ని కాదనుకుంది.

అంత మంచి అవకాశాన్ని పరిణీతి ఎందుకు వదులుకుంది అంటే ఆమె ఆ సినిమా బదులుగా వేరే సినిమా కమిట్ అవడమే అంటుంది. యానిమల్ సినిమా టైం లోనే ఇంతియాజ్ అలి మూవీ ఆఫర్ వచ్చిందట. అందుకే పరిణీతి చోప్రా యానిమల్ సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చిందట.. మనకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాన్నే ఎంపిక చేసుకోవాలి అంటూ రణ్ బీర్ సినిమా మిస్ అవడంపై స్పందించిన పరిణీతి చోప్రా. ఇంతియాజ్ అలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చంకిలా సినిమా లో పరిణీతి చోప్రా నటిస్తుంది. ప్రస్తుతం ఊంచాయ్ మూవీలో నటిస్తున్న పరిణీతి చోప్రా రీసెంట్ గా ఆ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, అనుపం ఖేర్, బొమన్ ఇరాని, నీనా గుప్తా నటిస్తున్నారు.

పరిణీతి చోప్రా వదులుకున్న యానిమల్ ఛాన్స్ ని కన్నడ భామ రష్మిక మందన్న కొట్టేసింది. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరక్టర్ సందీప్ వంగ అదే సినిమాని హిందీ వర్షన్ లో తీసి అక్కడ సూపర్ హిట్ అందుకున్నాడు. యానిమల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. యానిమల్ మూవీ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సినిమాతో సౌత్ ఆడియన్స్ ని అలరించిన రణ్ బీర్ కపూర్ యానిమల్ తో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకునోనున్నాడు.