Begin typing your search above and press return to search.

సహజీవనం అలా కూడా చేయచ్చంట

By:  Tupaki Desk   |   14 Feb 2016 10:31 AM IST
సహజీవనం అలా కూడా చేయచ్చంట
X
బొద్దుగా ఉండే ముద్దుగుమ్మలు వెండితెర మీద వెలగటం కష్టమని అనుకుంటారు కానీ.. పరిణితీ చోప్రా అలాంటివన్నీ ఉత్త అపోహలుగా తేల్చేసింది. కావాల్సినంత అందం.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎంత ప్రదర్శించాలో అమ్మడిగా బాగానే తెలుసు. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలన్న లెక్కలకు భిన్నంగా ఉండి మెప్పించటం పరిణితి స్పెషాలిటీ.

ఆ మధ్య ఒక ఊపు ఊపేసిన పరిణితి ఈ మధ్య కాస్త స్లో అయ్యింది. పలువురితో పరిణితికి ఎఫైర్ ఉందని చెబుతున్నా.. తాను మాత్రం సింగిలేనని తేల్చి చెబుతోంది. ప్రేమ.. పార్టనర్ లాంటి విషయాల మీద ఓపెన్ గా మాట్లాడేసిన ఆమె.. సహజీవనం మీద తన అభిప్రాయాన్ని చెప్పేసింది. అయితే.. అమ్మడు చెప్పిన సహజీవనం కాన్సెప్ట్ కాస్తంత చిత్రంగా ఉండటం గమనార్హం.

మనసుకు నచ్చినోడు కనిపిస్తే.. కలిసి ఉండేందుకు ఏ మాత్రం మొహమాట పడని ఈ రోజుల్లో.. కలిసి ఒకే ఇంట్లో ఉండటమే సహజీవనం కాదని.. దూరం దూరంగానే ఉంటూ వారానికి నాలుగైదు గంటలు గడిపినా తృప్తిగా.. సంతోషంగా ఉండాలని చెబుతోంది. ఒకరి కోసం ఒకరు అడ్జెస్ట్ కావాలని.. ఒకరి సంతోషం కోసం మరొకరు అన్నట్లుగా జీవించాలని చెబుతోంది. ఒకరి జీవితంలో మరొకరు ఉండాలే తప్పించి.. ఒకే ఇంట్లో ఇద్దరూ కలిసి ఉండాల్సిన అవసరం లేదంటోంది. వెండితెర మీద వీర ఫాస్ట్ గా చెలరేగిపోయే పరిణితి వాస్తవ జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.