Begin typing your search above and press return to search.

పరిణీతి.. ఎవరినమ్మా హగ్‌ చేసుకుంది?

By:  Tupaki Desk   |   14 May 2016 10:22 AM IST
పరిణీతి.. ఎవరినమ్మా హగ్‌ చేసుకుంది?
X
హాటీ పరిణీతి చోప్రా.. ఈ మధ్యన తెగ వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడైతే అమ్మడు సూపర్‌ స్టార్ మహేష్‌ సరసన ఏ.ఆర్‌.మురుగదాస్‌ సినిమాలో నటిస్తోందని వార్తలు వచ్చాయో.. ఇక టాలీవుడ్‌ లోనూ వరల్డ్ ఫ్యామస్‌ అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు షేర్‌ చేసిన ఒక ఫోటో.. అతి పెద్ద న్యూస్‌ అయిపోయింది మరి.

చూస్తున్నారుగా ఆ బొమ్మ.. ముందుగా ఆ టీ షర్టు సందుల్లోంచి అమ్మడి బికినీ టాప్‌ మనల్ని ఎట్రాక్ట్ చేస్తుంటే.. మన కళ్లను పక్కకు తిప్పుకోవడం కాస్త కష్టమే. ఆమె ధరించిన ఆ నల్లటి ఇన్నర్ వేర్‌ ను డిజైనర్ బ్రాలెట్‌ అంటారు. ఇకపోతే ఈ మొత్తం బొమ్మలో అసలు పరిణీతిని హగ్‌ చేసుకున్న ఆ ఛమత్కారుడు ఎవరు అనేదేగా మీ ప్రశ్న? అందరిదీ అదే ప్రశ్న. అయితే అతగాడు ఈ ఫ్యాషన్‌ అండ్‌ సినిమా వరల్డ్ లో బాగా వరల్డ్ ఫ్యామస్‌ అండోయ్‌.

ఆ అబ్బాయి పేరు ఎల్టన్‌ ఫెర్నాండెజ్. అతడొక మేకప్‌ మ్యాన్‌. అదేలేండి.. ఫ్యాషనబుల్ మేకప్ ఆర్టిస్టు. కాకపోతే మేబెల్లైన్‌ వంటి పెద్ద పెద్ద కాస్మొటిక్‌ జైంట్లకు మనోడు ప్రతినిధి. బాగా కాస్ట్ లీ గానే ఛార్జ్‌ చేస్తాడు కుర్రాడు. అంతటి టాప్ మేకప్ గయ్‌ ను మరి మన పరిణీతి ఒక హగ్గిచ్చి ఫోటో తీసుకోకపోతే ఎలా? ఈ భామలకు ముఖ్యమైనది మేకప్పేగా.