Begin typing your search above and press return to search.
నాపై అవే విమర్శలు వినీ వినీ విసిగిపోయాను!
By: Tupaki Desk | 30 May 2021 9:00 AM ISTఅందాల కథానాయికల ఫేట్ నిర్ణయించేది.. హిట్టు మాత్రమే. ఫ్లాప్ సినిమాలో ఎంత గొప్పగా నటించినా పేరు రాదు. జనం చూడని సినిమాలో ఎంతగా ఇదగదీసినా ప్రయోజనం ఏం ఉంటుంది? అలా గుర్తింపును కోల్పోయిన ప్రతిభావంతులైన తారలెందరో. ఇప్పుడు తాను కూడా అదే జాబితాలో చేరానని అంటోంది పరిణీతి చోప్రా.
పారీ తన కెరీర్ ను రైజింగ్ గానే ప్రారంభించి కొన్ని హిట్ లను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు బాగా ఆడకపోవడంతో సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించలేక చతికిలబడింది. అయితే గత రెండు నెలల్లో పరిణీతి నటించిన మూడు చిత్రాలు ప్రశంసలను అందుకున్నాయి. తన నటనకు మంచి పేరొచ్చింది.
నువ్వు నీ బెస్ట్ ఇవ్వలేదు! అని ప్రజలు పదే పదే అడుగుతుంటే వినీ వినీ విసిగిపోయానని.. నీరసించానని పారీ ఆవేదన చెందింది. పరిణీతి కెరీర్ లో ఫ్లాప్ ల వాటా పెద్దదే అయినా ఇటీవల నెమ్మదిగా కోలుకుంటోంది. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ చిత్రంలో తన నటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు `సందీప్ P ర్ పింకీ ఫరార్` చిత్రంలో నటనకు మంచి సమీక్షలను అందుకుంటోంది.
ఇటీవలి ఇంటర్వ్యూలో పరిణీతి మాట్లాడుతూ..``నేను ఎప్పుడూ నా వంతు కృషి చేశానని.. అయితే ఎంచుకున్న ప్రాజెక్టులు నా నటనా సామర్థ్యాన్ని ఉత్తమంగా ప్రదర్శించడానికి అవకాశం కల్పించేవి కావని పారీ అన్నారు. నిరూపించుకునేందుకు స్కోప్ లేదని తెలిపారు.
మీకు ప్రతిభ ఉంటే.. ఆ ప్రతిభను బయటకు తీసుకురాగలిగితే అది ఒక నటి సాధించిన అతిపెద్ద ఘనత. ప్రతిభావంతులైన నటులు చాలా మంది ఉన్నారు. కానీ దానిని ప్రదర్శించడానికి మంచి స్క్రిప్ట్ దొరకదు. ప్రతిభావంతులు అని చెప్తూనే ఉంటారు. కానీ పైకి ఎదగలేరు. ఇది చాలా దురదృష్టకర పరిస్థితి. నా కెరీర్ ఆరంభం మంచి అకాశాలే వచ్చాయి. సినిమాలు హిట్టయ్యాయి. అవార్డులు వచ్చాయి. నాకు ప్రశంసలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన సినిమాల్లో నా నటనా నైపుణ్యాలను ప్రశ్నించారు.. అని పరిణీతి ఇంటర్వ్యూలో చెప్పారు.