Begin typing your search above and press return to search.

#సైనా బ‌యోపిక్.. వైదొల‌గిన‌ శ్ర‌ద్ధాపై ప‌రిణీతి కౌంట‌ర్

By:  Tupaki Desk   |   9 March 2021 10:00 PM IST
#సైనా బ‌యోపిక్.. వైదొల‌గిన‌ శ్ర‌ద్ధాపై ప‌రిణీతి కౌంట‌ర్
X
బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ త్వ‌ర‌లో రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిన‌దే. ప‌రిణీతి చోప్రా టైటిల్ పాత్ర‌ను పోషించిన ఈ సినిమా పోస్ట‌ర్ టీజ‌ర్ స‌హా ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ట్రైలర్ ‌ను విడుదల చేయ‌గా అది అంత‌ర్జాలంలో దూసుకెళ్లింది.

దర్శకుడు అమోల్ గుప్తే ఈ సినిమాని ఎంతో ప‌రిణ‌తితో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నార‌ని ట్రైల‌ర్ ప్రామిస్ చేసింది. నిజానికి ఈ బ‌యోపిక్ లో తొలిగా శ్ర‌ద్ధా క‌పూర్ టైటిల్ పాత్ర‌కు ఎంపికైంది. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ ప్రాజెక్టు నుంచి శ్ర‌ద్ధా వైదొల‌గింది. ఆ త‌ర్వాత ప‌రిణీతిని ఎంపిక చేశారు. ఏడాది పాటు ఈ బ‌యోపిక్ కోస‌మే బ్యాడ్మింట‌న్ ప్రాక్టీస్ చేసిన శ్ర‌ద్ధా స‌డెన్ గా వైదొల‌గ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పుడు ఇదే ప్ర‌శ్న త‌న‌నే అడిగేస్తే ప‌రిణీతి ఇచ్చిన స‌మాధానం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తాను ద‌ర్శ‌కుడి కోణాన్ని మాత్ర‌మే ఆలోచించాన‌ని ప‌ని పైనే దృష్టిని సారించాన‌ని ప‌రిణీతి అన్నారు. బ‌యోపిక్ నుంచి శ్రద్ధా కపూర్ నిష్క్రమణ తనకు ఆందోళన కలిగించే విషయం కాదని కేవలం వృత్తికి అంకిత‌మై చేసే ప‌నిపైనే దృష్టి సారిస్తాన‌ని పారీ అన‌డం వేడెక్కించింది.

శ్ర‌ద్దా వైదొలిగిన పాత్ర‌లో న‌టిస్తున్నారు కాబ‌ట్టి ఒత్తిడి అనిపించ‌లేదా? అని అడిగితే... తన సామర్థ్యం మేరకు ఆ పాత్రను పోషించడంపై మాత్రమే దృష్టి పెట్టాన‌ని పారీ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రం. నిజానికి ద‌ర్శ‌క‌ర‌చ‌యిత ఆమోల్ గుప్తేతో విభేధించి శ్ర‌ద్ధా ఈ బ‌యోపిక్ నుంచి వైదొలింగింది. అందుకే ముంబై మీడియా గుచ్చి గుచ్చి అవే ప్ర‌శ్న‌ల‌తో వేడెక్కించింది.