Begin typing your search above and press return to search.

ప‌రిణితి స్కిన్ షోతో కాక‌లు!

By:  Tupaki Desk   |   27 Dec 2021 1:30 AM GMT
ప‌రిణితి స్కిన్  షోతో  కాక‌లు!
X
బాలీవుడ్ బ్యూటీ ప‌రిణితి చోప్రా కొత్త ఫోటో షూట్ స్కిన్ షోతో ఆక‌ట్టుకుంది. క్లీవేజ్ లో అందాల్ని వీలైనంత గా ఎలివేట్ చేస్తూ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ పిక్లో ప‌రిణీతి క్రాప్ట్ టాప్ని ధ‌రించింది. అది కేవ‌లం బ్యూటీ అందాల్ని మాత్ర‌మే క‌వ‌ర్ చేసింది. ముఖంలో కిల్ల‌ర్ ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌ట్టిప‌డేస్తుంది. వివిధ కోణాల్లో అమ్మ‌డు కెమారాకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈపిక్ ఇన్ స్టాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ప‌రినీతి ఇన్ స్టా పాలోవ‌ర్స్ 4 మిలియ‌న్స్ పైగా ఉన్నారు. అభిమానులు హాట్ కామెంట్ల‌తో ఎటాక్ చేయం మామూలే. ఫిల్మ్ ఫేర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం ఇచ్చిన ఫోటోలు ఇవి.

ఇక ప‌రిణితి చోప్రా న‌ట వృత్తి విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో అమ్మ‌డి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `లేడీస్ వ‌ర్సెస్ రిక్కీ భాయ్ ` సినిమాతో లాంచ్ అయిన బ్యూటీ అటుపై బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుని బిజీ అయింది. స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులు అందుకుని త‌న‌కంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. సిస్ట‌ర్ ప్రియాంక చోప్రాకి దూర‌పు బంధువైనా ఆ ప్ర‌భావం ఎక్క‌డా మీద ప‌డ‌కుండా త‌న‌కు తానుగానే ఎదిగే ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయిన న‌టిగా చెప్పొచ్చు. పీసీ గ్లోబ‌ర్ స్టార్ గా ప్ర‌మోట్ అవ్వ‌డం..హాలీవుడ్ లో బిజీ అవ్వ‌డంతో బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా లేని లోటుని కొంత వ‌ర‌కూ భ‌ర్తీ చేస్తుంది.

ప్ర‌స్తుతం ప‌రిణిత చోప్రా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. రిబు దాస్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోంది. అలాగే మ‌రో సినిమాలోనూ న‌టిస్తోంది. అయితే వాటి పూర్తి వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. మ‌రికొన్ని ప్రాజెక్ట్ ల‌కే సైన్ చేసింది. ఇక ద‌క్షిణాదిన సినిమాలు చేయాల‌ని బ్యూటీ ఆశ‌ప‌డుతుంది. కానీ స‌రైన అవ‌కాశం రాలేదు. ఆ మ‌ధ్య ఓ త‌మిళ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంద‌ని ప్ర‌చారం సాగిందిగానీ చివ‌రిగా ఛాన్స్ మిస్ అయిన‌ట్లు తెలుస్తోంది.