Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: పెళ్లి బట్టల్లో బాలీవుడ్ జంట!

By:  Tupaki Desk   |   6 Sept 2018 7:00 AM IST
ఫోటో స్టొరీ: పెళ్లి బట్టల్లో బాలీవుడ్ జంట!
X
గత రెండు మూడు రోజులుగా బాలీవుడ్ మీడియాలో ఒకటే రచ్చ. బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ - ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా ఇద్దరూ పెళ్లికి రెడీ అయ్యారని ఒకటే వార్తలు.. తీరా చూస్తే అదేమీ లేదు. జస్ట్ వాళ్ళిద్దరూ బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ కోసం బ్రైడల్ వేర్ లో పెళ్లి కూతురు-పెళ్లి కొడుకులా పోజిచ్చారు.. ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

ఇక ఈ ఫోటోలను ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అర్జున్ షేర్ చేయడంతో పాటుగా ఇలా క్యాప్షన్ పెట్టాడు "నాతో కవర్ పేజీ షేర్ నువ్వు చేసుకోవడం నీకు ఒక అమేజింగ్ మూమెంట్ పరిణీతి.. కంగ్రాచులేషన్స్. ఈ కొత్త హీరోయిన్లు అందరూ నా ఒడిలో వచ్చి ఇలా కూర్చుంటారు. నిన్ను 2012 నుండి నా ఒడిలో కూర్చోబెట్టుకుని నడిపిస్తున్నాను. ఇప్పటికి ఆరేళ్ళు అయినా సపోర్ట్ చేస్తున్నాను. పర్సనల్ సజెషన్: పిచ్చిదానా.. నువ్వు ఎమోషనల్ అయ్యి నాకు థ్యాంక్ కు చెప్పి నన్ను ఏడిపిస్తావా ఏంటి? ఇట్స్ ఒకే అలా ఏం అవసరం లేదు."

ఇలా చేసిన తర్వాత మరో గోల మొదలయింది. జంట చూడ ముచ్చటగా ఉందని ఫ్యాన్స్ అందరూ పెళ్లి చేసుకోమని ఒకటే గోల. ఎందుకంటే ఈ జంట 'ఇష్క్ జాదే' సినిమాలో అందరినీ మెప్పించింది. అందరూ పెళ్లి .. పెళ్లి అనడంతో ఇక వాళ్ళ గోల పడలేక అర్జున ఇలా ట్వీట్ పెట్టాడు "ఈ వయసులో ఉన్న కుర్రాడు పెళ్లి చేసుకునే తొందరలో లేడు. పరిణీతి.. నేను కాస్త వయసుకొచ్చి పెళ్లి సంగతి అలోచించి ఆప్షన్స్ వెతుక్కునే వరకూ ఆగవా ప్లీజ్".. ఇక అవతలి వైపునుండి గీత టైప్ లో పరిణీతి ఇలా రిప్లై ఇచ్చింది "ఓహ్... అర్జున్ నన్ను క్షమించు..నా కాల్షీట్స్ ఖాళీ గా లేవు. దయచేసి నా మేనేజర్ ను సంప్రదించు." చూస్తుంటే అక్క ప్రియాంక కంటే పరిణీతి ఇంకా ప్రొఫెషనల్ గా ఉన్నట్టుందే!