Begin typing your search above and press return to search.

మనసుకు నచ్చే కలర్ఫుల్ సాంగ్

By:  Tupaki Desk   |   23 Dec 2017 4:45 PM IST
మనసుకు నచ్చే కలర్ఫుల్ సాంగ్
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న సినిమా మనసుకు నచ్చింది. సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్రిదా చౌదరి మరొక ముఖ్య పాత్ర పోషిస్తోంది. కొన్ని నెలల క్రితం స్టార్ట్ అయినా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేస్తోంది. ఫుల్ క్లారిటీతో మొదటి సినిమానే ఛాలెంజింగ్ గా తీస్తున్నారు దర్శకులు మంజుల గారు.

అయితే కొన్ని రోజుల క్రితం సినిమా టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా ఫస్ట్ లుక్ లోనే ఓ వర్గం ప్రేక్షకుల్లో చిత్ర యూనిట్ అంచనాలను రేపింది. అయితే మళ్లీ మరొక స్పెషల్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి మరింత క్రేజ్ ని అందుకుంటున్నారు. ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా మంజుల ఈ కథను తెరకెక్కిస్తున్నారట. సినిమా షూటింగ్ కు కూడా ఏ మాత్రం బ్రేక్స్ పడటం లేదట. ఇక రిలీజ్ చేసిన సాంగ్ విషయానికి వస్తే.. పాట వినడానికి ఎంత స్వీట్ గా ఉందొ చూడటానికి కూడా అంతే మాధుర్యంగా ఉంది. చూస్తుంటే సాంగ్ ఇంకొంచెం సేపు ఉంటె బావుండు కాదా అని అనిపిస్తోంది.

పరిచయము లేదా అనే ఈ సాంగ్ ని అనంత శ్రీరామ్ రచించగా సమీరా భరద్వాజ్ ఆలపించారు. ఇక రధన్ తనదైన శైలిలో మంచి మ్యూజిక్ ని అందించాడు. మొత్తంగా ప్రోమో పాట మాత్రం చాలా స్వీట్ కలర్ఫుల్ గా ఉంది. మరి సినిమా ఇంకెంత కలర్ఫుల్ గా ఉంటుందో చూడాలి.