Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌లా ఉందే

By:  Tupaki Desk   |   9 July 2018 4:47 PM GMT
ట్రైల‌ర్ టాక్: స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌లా ఉందే
X
ఈ రోజుల్లో జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం చాలా క‌ష్ట‌మైపోతోంది. పేరున్న న‌టీన‌టులున్న సినిమాలొచ్చినా జ‌నాల్ని థియేట‌ర్ల‌కు తీసుకురావ‌డం క‌ష్ట‌మైపోతోంది. టీజ‌ర్.. ట్రైల‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంటే త‌ప్ప జ‌నాలు సినిమా చూడ్డానికి రావ‌ట్లేదు. అవి బాగుంటే కొత్త వాళ్లు న‌టించిన సినిమా అయినా జ‌నాలు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆ మ‌ధ్య ‘ ప‌రిచ‌యం ’ అనే కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్.. టీజ‌ర్ జ‌నాల దృష్టిని కొంత వ‌ర‌కు ఆక‌ర్షించాయి. ఇప్పుడీ చిత్ర ట్రైల‌ర్ కూడా లాంచ్ అయింది. అది చూస్తే ఈ సినిమా ఒక‌ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కింద‌నిపిస్తోంది. కొత్త హీరో హీరోయిన్లు విరాట్ కొండూరు.. సిమ్ర‌త్ కౌర్ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది.

హైద‌రాబాద్ న‌వాబ్స్.. నిన్న నేడు రేపు.. క‌మీనే లాంటి సినిమాలు తీసిన ల‌క్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఒక అబ్బాయి.. అమ్మాయి ప్రేమించుకోవ‌డం.. ఒక‌రి మీద ఒక‌రు ప్రాణం పెట్టుకోవ‌డం.. కానీ పెద్ద‌ల అడ్డు ప‌డ‌టంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం రావ‌డం.. చివ‌రికి అన్ని అడ్డంకుల‌నూ అధిగ‌మించి ప్రేమ జంట ఒక్క‌డ‌వ‌డం.. ఇలా క‌థగా చూస్తే ఇది మామూలుగానే అనిపిస్తోంది. కానీ క‌థ‌నాన్ని మంచి ఫీల్ తో న‌డిపించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లున్నారు. విజువ‌ల్స్.. మ్యూజిక్ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అయ్యేలా ఉన్నాయి. సినిమాటోగ్రాఫ‌ర్ న‌రేష్ రానా.. సంగీత ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ చంద్ర‌ల కృషి అడుగ‌డుగునా క‌నిపిస్తోంది. త‌క్కువ బ‌డ్జెట్లోనే మంచి క్వాలిటీతో సినిమాను తీర్చిదిద్దిన‌ట్లున్నారు. హీరో హీరోయిన్లు తాజాగా.. అమాయ‌కంగా క‌నిపిస్తున్నారు. ఈ నెల 21న ‘పరిచయం’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.