Begin typing your search above and press return to search.

ట్రైలర్: గిప్పుడే నిమ్మలం కార్రి అంటున్న పరేశాన్ బ్యాచ్..!

By:  Tupaki Desk   |   21 May 2023 9:43 PM IST
ట్రైలర్: గిప్పుడే నిమ్మలం కార్రి అంటున్న పరేశాన్ బ్యాచ్..!
X
మసూద విజయంతో దూసుకుపోతున్న యంగ్ హీరో తిరువీర్ పల్లెటూరి సరదా డ్రామా పరేషాన్‌ తో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్‌ సన్ దర్శకత్వం వహించారు. వాల్తేరు వీరయ్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా రావడంతో విపరీతమైన బజ్ ఏర్పడింది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కాబోతుంది.

రానా సమర్పిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. తిరువీర్ తండ్రి పరీక్షలలో అతని మార్కుల గురించి ఉపన్యాసం ఇవ్వడంతో వీడియో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తల్లి విపరీతంగా తిట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ ఉద్యోగం లేదు, సదువు సంకనాకిస్తివి, ఏ పనీ శాత కాదని వాళ్ల అమ్మ చెప్పే డైలాగ్స్ చూస్తుంటేనే హతిరువీర్ ఎలాంటి వాడో అర్థం అవుతుంది.

అలాగే ఏంది సత్తీ గిది.. నేను లిప్ లాసమ్ పట్కరమ్మన్న.. లిప్ లాసమ్ అంటే గిట్ల మూతికి పెట్టుకోంగనే చెక్కుమని మెరవాలే.. నాలెక్క. గిది సూడు పెదువులు పలిగితే పెట్టుకునే దానిలాగా ఉంది. నువ్వే పెట్టుకో నీ బర్రె మూతికి అని అమ్మాయి చెప్పే డైలాగ్ మరింత అలరిస్తోంది.

ఆ తర్వాత తిరువీర్ తో పాటు అతని స్నేహితుల లవ్ స్టోరీని చూపిస్తూ వచ్చే సాంగ్ కూడా అదిరిపోయింది. అచ్చమైన పల్లెటూరి లాంగ్వేజీలో రాబోతున్న ఈ కామెడీ సినిమా అందరిలోనూ అంచనాలను పెంచేస్తోంది.

ఆహ్లాదకరమైన విలేజ్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా చాలా కామెడీగా ఉంది. అద్భుతమైన టైమింగ్ తో ఆకట్టుకుంటున్న తిరువీర్ పాత్ర కూడా అదిరిపోయింది. ఈ చిత్రానికి వాసు పెండమ్‌ ఛాయాగ్రహకుడిగా పని చేస్తుండగా.. శ్వంత్‌ నాగ్‌ చౌరస్తా సంగీతం అందిస్తున్నారు. జూన్ రెండో తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి హరి శంకర్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తిరువీర్ సరసన ఈ సినిమాలో పావని కరణం నటించబోతోంది. అలాగే బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుద్దెర ఖాన్, రవి, రాజు బేడిగల, శృతి రాయన్, అంజి బాబు వాల్గమాన్, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత, సురభి రాఘవ, శివరామ్ మరియు సాయి కిరణ్ యాదవ్ లు కూడా కనిపించబోతున్నారు. ట్రైలర్ యే ఇంత అధ్భుతంగా ఉండగా.. సినిమా ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాలి మరి.