Begin typing your search above and press return to search.
చైతూ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్...!
By: Tupaki Desk | 30 April 2020 11:00 AM IST'గీతగోవిందం' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు డైరెక్టర్ పరశురామ్. 'గీతగోవిందం' తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనుకుని ఆయనకు కథ కూడా చెప్పాడు. అయితే అప్పుడు మహేష్ ఖాళీ లేకపోవడంతో కుదరలేదు. ఇతర హీరోలు కూడా బిజీగా ఉండడంతో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో సినిమా చేయడానికి పరశురామ్ సిద్ధమయ్యాడు. 14 రీల్స్ బ్యానర్ లో నాగచైతన్య హీరోగా సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకి 'నాగేశ్వరరావ్' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చూపించారట. ఈ తరుణంలో మహేష్ నుంచి పరశురామ్‌కు పిలుపొచ్చింది. అధికారిక ప్రకటన రాక పోయినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ కెరీర్లో 27వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం పరుశురామ్ దక్కించుకున్నాడని తెలుస్తోంది. దీంతో నాగచైతన్య సినిమాను పరశురామ్ పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కొడుకు సినిమా ఓకే చేసి వేరే ఆఫర్ రావడం తో వదిలేసాడని డైరెక్టర్ పరశురామ్ పై అక్కినేని నాగార్జున కోపంగా ఉన్నాడంటూ రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఇన్ని రోజులు నాగచైతన్య సినిమాను పరశురామ్ పూర్తిగా పక్కన పెట్ట లేదని.. వాయిదా మాత్రమే వేశాడని అనుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన పరశురామ్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తదుపరి చిత్రాలపై క్లారిటీ ఇచ్చాడు.
పరశురామ్ మాట్లాడుతూ.. నాగచైతన్యతో మొదలుపెట్టిన 'నాగేశ్వరరావ్' సినిమా ఆగిపోయిందనే వార్త పుకారు మాత్రమే. ఈ సినిమా కచ్చితంగా చేయబోతున్నాం. కాకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసిన అనంతరం ఉండే అవకాశం ఉంది. ఈ విషయంపై నేను చైతూ ఫుల్ క్లారిటీతో ఉన్నాం. ఈ సినిమా చైతన్య కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని కచ్చితంగా చెప్పగలను అని వివరణ ఇచ్చాడు. దీంతో నాగచైతన్యతో పరశురామ్ మూవీ క్యాన్సిల్ అయిందనే వార్తలకు చెక్ పడినట్లయింది. అంతేకాకుండా మహేష్ తో సినిమా అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. 'ఒక్కడు' సినిమా చూసి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాకు అదే హీరోని డైరెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టమని చెప్పుకొచ్చాడు. ఎలివేషన్ సీన్స్ మరియు కమర్షియల్ గూస్ బమ్స్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ గురించి ఫ్యాన్స్ కంగారు పడవలసిన అవసరం లేదని.. మహేష్ ఫ్యాన్స్ ఏమేమి కోరుకుంటారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని.. నాకు అలాంటివి తీయడం రాక కాదు, ఇప్పటి దాకా నా సినిమాల్లో వాటికి అవకాశం లేకపోవడం వల్లనే కుదరలేదని చెప్పుకొచ్చాడు.