Begin typing your search above and press return to search.

మరోసారి విజయ్ దేవరకొండతో పరశురామ్ .. హీరోయిన్ గా కీర్తి సురేశ్?

By:  Tupaki Desk   |   3 May 2021 6:00 AM IST
మరోసారి విజయ్ దేవరకొండతో పరశురామ్ .. హీరోయిన్ గా కీర్తి సురేశ్?
X
'గీత గోవిందం' సినిమాతో పరశురామ్ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తరువాత సినిమాను ఏకంగా ఆయన మహేశ్ బాబుతో చేస్తున్నాడు. 'సర్కారువారి పాట' టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందువలన చాలా కూల్ గా షూటింగు చేస్తూ వస్తున్నారు.

ఈ సినిమా కంటే ముందుగా పరశురామ్ .. నాగచైతన్య హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. మహేశ్ నుంచి ఛాన్స్ రావడంతో అటు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి రాగానే ఆయన చైతూతోనే సినిమా చేయనున్నాడని చెప్పుకున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. 'గీత గోవిందం' హిట్ దగ్గర నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందువలన ఇటీవల పరశురామ్ చెప్పిన ఒక లైన్ కి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ పేరునే వినిపిస్తూ ఉండటం మరో విశేషం.

అయితే చైతూ ప్రాజెక్టు తరువాత విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందా? లేకపోతే ముందుగా ఈ సినిమా చేసే చైతూ ప్రాజెక్టు పైకి వెళతాడా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. ఇందులో వాస్తవమెంతో తెలియదుగానీ, ఇప్పుడు ఈ విషయాన్ని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నిజమే అయితే వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ - కీర్తి సురేశ్ కాంబినేషన్ మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంటుందనే అభిప్ర్రాయలు మాత్రం వ్యక్తమవుతున్నాయి.