Begin typing your search above and press return to search.

ఆర్జీవీపై సాంగ్ తో ప‌వ‌న్ ఫ్యాన్స్ మొద‌లెట్టారు

By:  Tupaki Desk   |   21 July 2020 9:30 AM IST
ఆర్జీవీపై సాంగ్ తో ప‌వ‌న్ ఫ్యాన్స్ మొద‌లెట్టారు
X
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న శ‌త్రువుల్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏం చేసినా దానిని స‌క్సెస్ చేసుకోవ‌డం ఆయ‌న శైలి. కొన్ని జ‌నాల్ని మెప్పించ‌లేక‌పోవ‌చ్చు.. వ‌ల్గ‌ర్ గా ఉండొచ్చు. కానీ అంతిమంగా లక్ష‌ల్లో అయినా సంపాదించుకుంటున్నాడ‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.

అయితే ఆర్జీవీ వ‌ల్ల హ‌ర్ట్ అవుతున్న వాళ్లు మ‌హా అయితే పోలీస్ కేసులు పెడుతున్నారు. అత‌డిని సామాజిక మాధ్య‌మాల్లో తిట్ట‌డం తప్ప ఇంకేమీ చేయ‌లేక‌పోతున్నారు. ఒక‌వేళ ఆర్జీవీపై కౌంట‌ర్లు వేయాలంటే ఆయ‌న‌లానే యూట్యూబ్ సినిమానో ఓటీటీ ఏటీటీ సినిమానో తీయాలి త‌ప్ప వేరే గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇటీవ‌ల అలాంటి ఏటీటీ ప్ర‌య‌త్న‌మే మొద‌లైంది. అదే `ప‌రాన్న జీవి`. ఆర్.‌జీ.వీ పవర్ స్టార్ కు సమాధానంగా వస్తున్న చిత్రమిది. ఇటీవ‌లే హైదరాబాద్ ‌లోని ఓ ఫామ్ ‌హౌస్ ‌లో ప్రారంభ‌మై చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. టైటిల్ సాంగ్ ఇప్ప‌టికే రిలీజై ప‌వ‌న్ అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది.

జీవి ఆర్జీవీ నిర్జీవి.. అంటూ సాగే ఈ పాట పూర్తిగా ఆర్జీవీని టార్గెట్ చేస్తూ రాసుకున్న లిరిక్. ఇందులో అత‌డి క్యారెక్ట‌ర్ ని తిట్టి పోసే ప‌ద‌జాలం నిండుగా ఉంది. అంతా నా ఇష్టం అంటాడు. తల్లి చెల్లి తేడా తెలీనోడు.. సర్వం నికృష్టం అంటూ ఆర్జీవీ శైలిని తిట్టే ప్ర‌య‌త్నం చేశారు. కులాల దుర‌ద అంటిస్తాడ‌ని.. ఎదుటివారిపై బుర‌ద వేస్తాడ‌ని.. విమ‌ర్శించారు. అంతేకాదు ప‌వ‌ర్ స్టార్ తో ఆడ‌కు ఆట‌.. మొద‌లైన‌ట్టే సింహ‌పు వేట‌!! అంటూ ఆర్జీవీపై ఎటాక్ సాంగ్ తోనే మొద‌లైంది.

పాట‌కు పాట స‌మాధానం.. ఆట‌కు ఆట స‌మాధానం.. సినిమాకి సినిమానే కౌంట‌ర్ అన్న తీరుగా ప‌వ‌న్ అభిమానులు ఆర్జీవీపైనే సినిమా తీస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఏదేమైనా సినిమాకి సినిమానే స‌మాధానం! అనే ఆలోచ‌న మాత్రం మెచ్చ‌ద‌గిన‌ది. ప‌వ‌ర్ స్టార్ గెలుస్తాడా లేక ప‌రాన్న జీవిదే విజ‌య‌మా? అన్న‌ది ఆ సినిమాలు రిలీజ్ అయితే కానీ చెప్ప‌లేం.