Begin typing your search above and press return to search.

పరంపర సీజన్ 2.. ఈసారి అంతకుమించి

By:  Tupaki Desk   |   9 Jun 2022 10:30 AM GMT
పరంపర సీజన్ 2.. ఈసారి అంతకుమించి
X
ఇటీవల కాలంలో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సీరీస్ లు కూడా నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. రిస్క్ లేకుండా మంచి కంటెంట్ వెబ్ సిరీస్ నిర్మిస్తే ఆ తర్వాత వాటిని మళ్లీ అదే తరహాలో కొన సాగిస్తూ మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారు.

ఓటీటీ సంస్థలు కూడా భిన్నమైన కంటెంట్ను జనాలకు అందించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఇక ఆ మధ్య డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'పరంపర' ఘన విజయం సాధించిన విషయం తెలిసందే.

వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంగా 'పరంపర' రూపొందింది. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ వెబ్ సీరీస్ కు మరో సీజన్ కూడా సిద్ధమయ్యింది. ఫస్ట్ సీజన్ లో యాక్షన్, డ్రామా, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే సెకండ్ సీజన్ ను విడుదల చేయబతున్నట్లు తెలుస్తోంది.

మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథాంశంతో ఈ వెబ్ కంటెంట్ ఒక ఐదు సినిమాలకు సరిపోయే స్టఫ్ ఉందన్న పేరు సంపాధించుకుంది. ఇక ఈసారి స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఉండబోతోందని ప్రొడక్ష్ హౌస్ వెల్లడించింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. క్యాస్టింగ్ తోనే ఈ ప్రాజెక్ట్ పై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు.

ఫస్ట్ సీజన్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ కు ఇప్పుడు సెకండ్ సీజన్ ను అంతకుమించి అనేలా డిజైన్ చేస్తున్నారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

రాజకీయ అంశాలతో పాటు ఒక పవర్ఫుల్ రివెంజ్ అలాగే యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో ఈ వెబ్ సీరీస్ ను నిర్మించారు. త్వరలోనే 'పరంపర' సీజన్ 2 పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. మరి ఈ సారి సెకండ్ సీజన్ ఏ స్థాయిలో గుర్తింపు అందుకుంటుందో చూడాలి.