Begin typing your search above and press return to search.

‘పేపర్ బాయ్’ డైరెక్టర్​.. మరో క్రియేటివ్​ సినిమా! హీరోగా యూట్యూబ్​ స్టార్​!

By:  Tupaki Desk   |   17 Nov 2020 9:00 AM IST
‘పేపర్ బాయ్’ డైరెక్టర్​.. మరో క్రియేటివ్​ సినిమా!  హీరోగా యూట్యూబ్​ స్టార్​!
X
పేపర్ బాయ్ చిత్రంతో మంచిపేరు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్​ ఇప్పుడు మరో సరికొత్త కథతో ముందుకొస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాకు ‘విటమిన్ షి’ అనే టైటిల్​ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు క్రిష్​ ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. పలు షార్ట్​ఫిలిమ్స్​, ఇండిపెండెంట్​ సినిమాల్లో నటించిన శ్రీకాంత్​ గుర్రం హీరోగా నట్టిస్తుండగా.. గుజరాతీ అమ్మాయి ప్రాచి హీరోయిన్​గా నటిస్తున్నది. ఈ సినిమాను ఫుల్​మూన్​మీడియా ప్రోడక్షన్స్​ పతాకంపై రవి పొలిశెట్టి నిర్మించారు. ఈ చిత్ర విశేషాలను జయశంకర్​ మీడియాకు తెలిపారు.

‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ అనేది మన జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేదే చిత్ర కథ. మనకు సహాయకారిగా ఉంటుందనుకున్న ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ చివరకు మనల్నే డామినేట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది సెటైరికల్‌గా ఈ సినిమాలో చూపించాం. ఆ ర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత టాప్ లెవెల్‌కి వెళ్లినా.. మనుషుల భావోద్వేగాలను మాత్రం రీ ప్లేస్​ చేయలేదు. వీటన్నింటిని ఈ చిత్రంలో ఎంతో బాగా చూపించాం.

సినిమాలో మొత్తం 12 పాత్రలు ఉంటాయి. కానీ కథ మాత్రం నాలుగు పాత్రల చుట్టే తిరుగుతూ ఉంటుంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఈ చిత్రం షూటింగ్ చేశాం. స్టోరీ పరంగానే కాకుండా, టెక్నీకల్‌గా కూడా హైస్టాండర్డ్స్‌లో ఉంటుందీ సినిమా. ఇటీవలే ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ కాపీతో సహా సినిమా మొత్తం రెడీగా ఉంది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని ఆయన తెలిపారు.