Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: పంతంతో హిట్టు కొట్టేలా ఉన్నాడు

By:  Tupaki Desk   |   25 Jun 2018 7:32 AM GMT
ట్రైలర్ టాక్: పంతంతో హిట్టు కొట్టేలా ఉన్నాడు
X

యాక్షన్ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపిచంద్. అయితే ఇటీవల కాలంలో ఈ హీరో సినిమాలు వరుసగా అపజయాన్ని మూటగట్టుకుంటున్నాయి. చివరగా సాహసం - లౌక్యం తప్పితే పెద్దగా విజయాలు ఏమి అందలేవు. గోపి లాస్ట్ సినిమా గౌతమ్ నంద విజయాన్ని అందుకుంటుంది అని అనుకున్నప్పటికి ఆ సినిమా ఊహించని పరాజయాన్ని ఇచ్చింది. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పంతం సినిమాతో రాబోతున్నాడు.

మొదట్లో ఈ సినిమా టైటిల్ వినగానే అంతా రొటీన్ అనుకున్నారు. పైగా సినిమాకు బిజినెస్ లేదనే టాక్ కూడా సినిమా మీద ప్రభావం చూపించినట్లు అనిపించింది. కానీ ఫైనల్ గా టీజర్ తోనే గోపి సరికొత్తగా కనిపించి షాక్ ఇచ్చాడు. ఇక ట్రైలర్ తో అయితే మొత్తానికి సినిమాకు కావలసిన ప్రమోషన్స్ తెచ్చేశాడు. రాబిన్ హుడ్ తరహాలో పేదవాళ్ళకి సహాయాన్ని అందించే పాత్రలో కనిపించనున్నాడు. ఇక శంకర్ - రజినీకాంత్ శివాజీ కాన్సెప్ట్ లో సినిమా నడుస్తుంది అనే టాక్ వస్తోంది.

ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న రైటర్ చక్రవర్తి రాసుకున్న స్క్రీన్ ప్లే బావుంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పవచ్చు. మంచి మెస్సేజ్ తో వస్తున్న ఈ సినిమాలో కోర్ట్ సీన్ కూడా కనిపిస్తోంది. కామన్ మ్యాన్ ని గోపి ప్రశ్నిస్తుండడం హైలెట్ అని తెలుస్తోంది. గోపి సుందర్ మ్యూజిక్ కూడా సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ ను తెచ్చేలా ఉంది. ఇక మెహ్రీన్ కూడా సరికొత్తగా కనిపిస్తోంది. ఈ బ్యూటీ కూడా హిట్టు చూసి చాలా కాలమవుతోంది. మరి పంతం సినిమా గోపీకి మెహ్రీన్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.