Begin typing your search above and press return to search.

ప‌రిణీతి చోప్రా ఇంద్ర‌భ‌వ‌నం చూశారా?

By:  Tupaki Desk   |   20 Feb 2018 9:38 AM GMT
ప‌రిణీతి చోప్రా ఇంద్ర‌భ‌వ‌నం చూశారా?
X
ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీలు, సినీ తార‌లు త‌మ‌కు కావాల్సిన ఇంటికోసం ఎంత ఖ‌ర్చ‌యినా పెట్టేందుకు వెనుకాడ‌డం లేదు. అయితే - త‌మ‌కు న‌చ్చిన ఇల్లు దొరికే వ‌ర‌కు పిల్లిలాగా ఇళ్లు మార‌డానికి కూడా వెనుకాడ‌డం లేదు. బాలీవుడ్ బ్యూటీ ప‌రిణీతీ చోప్రా కూడా ఇలాగే త‌న డ్రీమ్ హౌస్ కోసం చాలాకాలంగా కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని తిరుగుతోంది. ఆ ప్రాసెస్ లో ప‌రి...దాదాపు 30 ఇళ్లు మారింది. ఎట్ట‌కేల‌కు బాంద్రాలోని బీచ్ ఒడ్డున త‌న క‌ల‌ల ఇంటిని ప‌రి..సొంతం చేసుకుంది. అధునాతన వ‌స‌తుల‌తో - బీచ్ వ్యూ ఉండేట్లుగా బాంద్రాలో ఉన్న ఆ ఇంటిని ప‌రిణీతి సొంతం చేసుకుంది. అంతేకాదు, ఆ ఇంటికి త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా ఇంటీరియ‌ర్ డిజైనింగ్ కూడా చేయించింది.

ముంబైలోని బాంద్రాలో 2015లో నిర్మించిన 2815 చ‌ద‌ర‌పు అడుగుల ఇంటిని ప‌రి కొనుగోలు చేసింది. ఆ ఇంట్లో 2 బెడ్రూంలు - మూడు బాత్రూంలు - డైనింగ్ రూం - లివింగ్ రూం - డెన్ - బాల్క‌నీ(బీచ్ వ్యూ) ఉన్నాయి. త‌న ఇంటి బాల్క‌నీలో నుంచి బీచ్ వ్యూ క‌నిపించేలా పరి డిజైన్ చేయించింది. ప్ర‌ముఖ ఇంటీరియర్ డిజైన‌ర్ ష‌బ్నం గుప్తా ఆ ఇంటిని ప‌రి...ఆలోచ‌న‌ల‌కు అణుగుణంగా తీర్చిదిద్దింది. బాల్క‌నీలో వెర్టిక‌ల్ గార్డెన్ తో పాటు ఉయ్యాల‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఆ ఇంట్లో ఓ చిన్న‌పాటి లైబ్ర‌రీని కూడా పెట్టేసింది. దాంతోపాటు ఓ వీడియో లైబ్ర‌రీ - సినిమాలు చూసేందుకు హోమ్ థియేట‌ర్ సిస్టమ్ కూడా ఉంది. మొత్తానికి ఎట్ట‌కేల‌కు త‌న క‌ల‌ల ఇంటిలోకి ప్ర‌వేశించిన ప‌రి...ఆనందానికి అవ‌ధుల్లేవ‌ని చెప్ప‌వ‌చ్చు.