Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో కోలీవుడ్ దర్శకుడి రికార్డ్

By:  Tupaki Desk   |   15 March 2016 5:30 PM GMT
టాలీవుడ్ లో కోలీవుడ్ దర్శకుడి రికార్డ్
X
గతంలో కంటే ఇప్పుడు ఏ భాషలో అయినా సంఖ్యా పరంగా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ సగటున నటులు చేసే సినిమాల సంఖ్య మాత్రం బాగా తగ్గిపోయింది. స్టార్ హీరోలయితే ఏడాదికి ఒక మూవీతో సరిపెట్టేస్తుంటే.. దర్శకుల తీరు కూడా ఇలాగే ఉంటోంది. ఒకళ్లిద్దరు తప్ప.. మెజారిటీ దర్శకులది ఇదే తీరు. కానీ ఇప్పుడో తమిళ దర్శకుడు.. టాలీవుడ్ లో రికార్డ్ సృష్టించబోతున్నాడు.

సూర్య - అమలాపాల్ నటించిన చిన్నారుల మూవీ మేము చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ మూవీ గతేడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉండగా.. తెలుగు వెర్షన్ ని తెరపైకి తెచ్చేందుకు ఆలస్యం అయింది. దీంతో పాటు విశాల్ హీరోగా నటించిన కథకళి చిత్రం కూడా అదే రోజున విడుదల కానుంది. ఈ చిత్రం సంక్రాంతికే రావాల్సి ఉండగా, సరైన డేట్ కుదరక ఆలస్యం జరిగింది. ఇప్పుడీ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలవుతుండగా.. రెండింటికీ దర్శకుడు పాండిరాజ్ కావడం విశేషం. పసంగ చిత్రాన్ని తీసి 2009లో 2 జాతీయ అవార్డులు అందుకున్న పాండిరాజ్ పై.. మంచి అంచనాలే ఉన్నాయి.

మేము - కథకళి తమిళ వెర్షన్లు మంచి పేరు తెచ్చుకోవడమే కాదు.. మంచి కలెక్షన్లు కూడా రాబట్టాయి. తెలుగులో కూడా ఈ ఫీట్ రిపీట్ కావచ్చంటున్నారు. మొత్తానికి ఒక నటుడి సినిమాలు కూడా ఒకే రోజున రెండు విడుదల కావడం కష్టమైన ఈ రోజుల్లో.. ఒక దర్శకుడు ఈ ఫీట్ అంటే రికార్డే.