Begin typing your search above and press return to search.
పంచె కట్టి.. కుంచె పట్టి.. బ్రహ్మీ గీసిన వేంకటేశుడి చిత్రం అద్భుత:
By: Tupaki Desk | 1 Jan 2021 4:21 PM ISTతెలుగు చలన చిత్రరంగంలో హాస్యబ్రహ్మగా ఆయన ప్రస్థానం అనన్యసామాన్యం. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ.. చలించని చిత్ర(పెయింటింగ్) రంగంలోనూ ఆయన ప్రతిభ అమోఘం! ఇది కొందరికి మాత్రమే తెలిసిన అంశం.
వృత్తిరిత్యా లెక్చరర్ అయిన బ్రహ్మానందం.. ప్రవృత్తిరిత్యా మంచి ఆర్టిస్టు. అయితే.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన మాష్టారు వృత్తిని వదిలినప్పటికీ.. పెయింటింగ్ హాబీని మాత్రం వదల్లేదు బ్రహ్మీ. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుంచె పట్టి అద్భుతమైన కళాఖండాలను చిత్రిస్తుంటాడు.
తాజాగా.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బొమ్మ గీశాడు బ్రహ్మానందం. బ్లాక్ అండ్ కలర్ లో పెన్సిల్ తో బ్రహ్మీ చెక్కిన చిత్రం.. తనలోని కళానైపుణ్యతను చాటి చెబుతోంది. పంచె కట్టుకొని నేలమీద కూర్చొని తదేక దృష్టితో చిత్రాన్ని గీస్తున్న బ్రహ్మీ పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
కాగా.. గతంలోనూ బ్రహ్మీ తన టాలెంట్ ను బయటపెట్టాడు. ఒకసారి ఆంజనేయ స్వామి చిత్రం, మరోసారి గాంధీజీ చిత్రాలను గీసి అబ్బురపరిచారు. తాజాగా.. మరోసారి కుంచెపట్టిన హాస్య బ్రహ్మ.. తనదైన నైపుణ్యంతో తిరుపతి వెంకన్న బొమ్మ గీశాడు.