Begin typing your search above and press return to search.

పాన్ ఇంటర్నేషనల్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   20 Jun 2021 5:37 AM GMT
పాన్ ఇంటర్నేషనల్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌
X
కన్నడ సూపర్‌ స్టార్ సుదీప్ నటిస్తున్న మోస్ట్‌ క్రేజీ అండ్‌ భారీ బడ్జెట్‌ చిత్రం విక్రాంత్ రానా. 55 దేశాల్లో ఈ సినిమాను 3డి ఫార్మట్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న కారణంగా ఈ సినిమా ను పాన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అంటూ యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. పలు భాషల్లో విడుదల చేయబోతున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్ డౌన్ కు ముందే పూర్తి అయ్యింది. ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతోంది.

సినిమా షూటింగ్‌ కొన్ని నెలల క్రితమే ముగించేసిన సుదీప్‌ వచ్చే వారంలో డబ్బింగ్‌ చెప్పబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా లో నటించిన పలువురు డబ్బింగ్‌ పూర్తి చేశారు. మరి కొందరు డబ్బింగ్‌ చెప్తే సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అవ్వబోతుంది. సుదీప్‌ సౌత్‌ ఇండియాలోనే కాకుండా ఉత్తరాదిన కూడా గుర్తింపు ఉన్న నటుడు. కనుక విక్రాంత్ రానా సినిమా పెద్ద ఎత్తున ఇండియాలో విడుదల అవ్వబోతుంది. కేవలం ఇండియా లో మాత్రమే కాకుండా ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా 55 దేశాల్లో విడుదలకు సిద్దం చేస్తున్నట్లుగా గతంలోనే నిర్మాతలు పేర్కొన్నారు.

కన్నడ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ అనూప్ బండారి దర్శకత్వంలో ఈ సినిమాను మంజునాథ్ గౌడ నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమాల మార్కెట్‌ భారీగా పెరిగింది. ఈ సినిమా తో కన్నడ సినిమా ను ప్రపంచం గుర్తించేలా చేస్తామంటూ విక్రాంత్ రానా యూనిట్‌ సభ్యులు ధీమాగా ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.