Begin typing your search above and press return to search.

'సలార్' ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ - యష్..!

By:  Tupaki Desk   |   15 Jan 2021 9:13 AM GMT
సలార్ ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ - యష్..!
X
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ''సలార్'' సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్‌' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించనున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాని నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి 'కేజీఎఫ్' ఫేమ్ య‌శ్ అతిథిగా హాజరయ్యారు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఒకే చోట కనిపించిన 'సలార్' ప్రారంభోత్సవ ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేస్తూ.. ''నాకు అవ‌కాశం ఇచ్చిన హోంబ‌లే ఫిలింస్ అధినేత విజ‌య్ కిర‌గందూర్‌ గారికి, ప్ర‌భాస్‌ గారికి ధ‌న్య‌వాదాలు. అలాగే నా ప్రియ‌మైన రాకింగ్ స్టార్ య‌ష్ ఈరోజు మాతో క‌లవ‌డం మ‌రింత ఆనందాన్ని ఇచ్చింది. మీ ప్రేమ‌, ఆశీర్వాదాలు అందిస్తున్న అంద‌రికీ థాంక్స్‌. 'స‌లార్' మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌ర‌చ‌దు'' అని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జ‌న‌వరి చివ‌రి వారం నుంచి జరుపుకోనుంది. ఇప్పటికే 'రాధేశ్యామ్' చిత్రీకరణ చివరి దశకు తీసుకొచ్చిన ప్రభాస్.. 'సలార్' చిత్రాన్ని కూడా ఇదే ఏడాదిపూర్తి చేస్తాడని తెలుస్తోంది.