Begin typing your search above and press return to search.

యువహీరోకు పాన్ ఇండియా స్టార్ సపోర్ట్.. లభించిందా??

By:  Tupaki Desk   |   1 April 2021 2:30 AM GMT
యువహీరోకు పాన్ ఇండియా స్టార్ సపోర్ట్.. లభించిందా??
X
ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోగా సెటిల్ అవుతున్నాడు యువహీరో నవీన్ పొలిశెట్టి. పదేళ్లనుండి ఇండస్ట్రీలో నటుడుగా సెట్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న నవీన్.. చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించాడు. ఇన్నేళ్లు గడిచాక 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. అదృష్టంకొద్దీ ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నవీన్ కు హీరోగా మంచిపేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వెంటనే సినిమాలు చేయకుండా ఆలోచించి 'జాతిరత్నాలు' సినిమా చేసాడు. ఇటీవలే విడుదలైన ఆ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ దెబ్బతో నవీన్ పూర్తిగా సెట్ అయిపోయాడనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఐతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా టాలెంటెడ్ యాక్టర్ కనిపిస్తే సపోర్ట్ చేసేవారిలో డార్లింగ్ ప్రభాస్ ముందుంటాడు. అలాగే సపోర్ట్ తో పాటు సినిమా అవకాశాలు కూడా కల్పిస్తుంటాడు. తన హోమ్ బ్యానర్ అయినటువంటి యూవి క్రియేషన్స్ నిర్మించే సినిమాల్లో అవకాశాలు ఇస్తుంటాడు. ఐతే యూవి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క నటించనున్న కొత్త సినిమాకోసం నవీన్ పేరును ప్రభాస్ రిఫర్ చేసినట్లు సమాచారం. పి. మహేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క 40ఏళ్ల మహిళగా కనిపించనుంది. ఆమెతో ప్రేమాయణం నడిపే 20ఏళ్ల కుర్రాడిగా నవీన్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఐతే ప్రభాస్ రిఫర్ చేయడం వలనే నవీన్ ఆ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి ఇప్పటికే చాలామందిని సపోర్ట్ చేసి వాళ్ల కెరీర్ లిఫ్ట్ చేసాడు ప్రభాస్. మరి ఆయన సపోర్ట్ తో జాతిరత్నం లైఫ్ మారిపోనుందా.. చూడాలి!