Begin typing your search above and press return to search.
పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళ్తున్న పాన్ ఇండియా స్టార్..!
By: Tupaki Desk | 15 Dec 2020 5:00 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇప్పటికే రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది సెట్స్ పై ఉండగానే 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఇదే క్రమంలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో 'ఆదిపురుష్' అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఈ మూడు సినిమాలు లైన్ లో పెట్టాడని అభిమానులు ఖుషీ అవుతుంటే ఇటీవల నాల్గో సినిమా అనౌన్స్ చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. 'కేజీఎఫ్' ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే పాన్ ఇండియా మూవీ ప్రకటించాడు ప్రభాస్. ఈ సినిమాలన్నింటిని పర్ఫెక్ట్ ప్లాన్ తో పూర్తి చేయడానికి డార్లింగ్ ప్లాన్స్ చేసుకున్నాడని తెలుస్తోంది.
2019 లో 'సాహో' సినిమాని రిలీజ్ చేసిన ప్రభాస్.. 2020లో కరోనా కారణంగా ఒక్క సినిమాని కూడా విడుదల చేయలేకపోయాడు. కాకపోతే రాబోయే రెండేళ్లలో మూడు సినిమాలను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేసుకున్నాడు. ముందుగా 'రాధే శ్యామ్' ని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నారు. ఇక 'ఆది పురుష్' ని ఎప్పుడు స్టార్ట్ చేసేదీ తెలియనప్పటికీ.. 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలానే 2021 జనవరిలో 'సలార్' ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు పూర్తి చేసి భారీ స్థాయిలో తెరకెక్కనున్న నాగ్ అశ్విన్ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇప్పటి వరకు స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసిన ప్రభాస్.. ఇప్పుడు మాత్రం వరుస పాన్ ఇండియా సినిమాలు చేయడం సంతోషించదగ్గ విషయమనే చెప్పాలి.