Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ 3డి: విలుకాడు ఇంటిద‌గ్గ‌రే సెట‌ప్ చేశాడు!

By:  Tupaki Desk   |   27 Aug 2020 10:15 AM IST
ఆదిపురుష్ 3డి: విలుకాడు ఇంటిద‌గ్గ‌రే సెట‌ప్ చేశాడు!
X
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ క‌థానాయ‌కుడిగా ఆదిపురుష్ 3డి తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. తానాజీ ఫేం ఓం రౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. వీఎఫ్.ఎక్స్ మాయాజాలంతో విజువ‌ల్ ఫీస్ట్ అందించేందుకు టీసిరీస్ సంస్థ భాగ‌స్వాముల‌తో క‌లిసి ఏకంగా 500 కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేయ‌నుంది. దాదాపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 20 భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ప్ర‌భాస్ లుక్ డిజైన్ ఇంచుమించు శ్రీ‌రాముడిని త‌ల‌పిస్తుంది. మెలూహా త‌ర‌హా పాత్ర చిత్ర‌ణ క‌నిపిస్తుంద‌న్న ప్ర‌చారం ఉంది. క్యారెక్ట‌రైజేష‌న్ పూర్తిగా ఫిక్ష‌నైజ్డ్ గా ఉంటుంది. అయితే క‌థానాయ‌కుడి పాత్ర ఒక విలుకాడు. విలువిద్య‌లో ప్రావీణ్యం అవ‌స‌రం. అందుకోసం అంత‌ర్జాతీయ ఆర్చ‌ర్ల‌ను బ‌రిలో దించుతార‌ని ప్ర‌భాస్ విదేశాల‌కు వెళ్లి శిక్ష‌ణ పొందాల్సి ఉంటుంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం అవుతోంది.

కానీ అదేదీ నిజం కాదు. ప్ర‌భాస్ ఇప్ప‌టికే విలువిద్య‌లో సుశిక్షితుడు. బాహుబ‌లి స‌మ‌యంలోనే అన్నిర‌కాల విద్య‌ల్ని రాజ‌మౌళి స‌హా కోచ్ ల‌ స‌మ‌క్షంలో అభ్య‌సించాడు. అప్ప‌ట్లోనే విలువిద్య‌ను క‌త్తి తిప్ప‌డాన్ని కూడా నేర్చుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు ప్రాక్టీస్ చేస్తే స‌రిపోతుంది. అలాగే త‌న ఇంటి ప‌రిస‌రాల్లో డార్లింగ్ ఎల్ల‌పుడూ విలువిద్య‌ను ప్రాక్టీస్ చేస్తుంటాడ‌ట‌. ఇక‌పైనా దానిని కొన‌సాగిస్తాడు. స‌రిగ్గా సినిమా సెట్స్ కెళుతుంది అన‌గానే విలువిద్య‌లో మేటి క్రీడాకారుడిని పిలిపించి మ‌రోసారి శిక్ష‌ణ తీసుకుంటాడ‌ట‌.

అప్ప‌ట్లోనే బాహుబలి షూటింగ్ సందర్భంగా హైదరాబాద్ లోని తన పాత గెస్ట్ హౌస్ లో విలువిద్య శ్రేణి (వ‌రుస‌)ని ఏర్పాటు చేశాడు. బాణాల‌తో కొడుతూ ప్రాక్టీస్ చేసేవాడు. ప్రభాస్ తన నివాసంలో ఒక విలువిద్య శ్రేణిని ఏర్పాటు చేసుకుని సమయం దొరికినప్పుడల్లా అభ్యసించడానికి ఆసక్తి చూపుతాడు. ప్ర‌స్తుతం దానిని కొన‌సాగిస్తాడ‌ని తెలుస్తోంది. ఆదిపురుష్ 3డి చిత్రం 2021 సెకండాఫ్ లో ప్రారంభమవుతుంది. 2022 లో విడుదల అవుతుంది. సైఫ్ ఖాన్ ఇందులో విల‌న్ గా న‌టించ‌నుండ‌గా.. కియ‌రా అద్వాణీ సీత పాత్ర‌లో న‌టిస్తుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.