Begin typing your search above and press return to search.

భారీ ప్రాజెక్ట్ సెట్ చేసాడు సరే.. ఆ దర్శకుడిని ఎలా డీల్ చేస్తాడు?

By:  Tupaki Desk   |   16 Feb 2021 9:00 PM IST
భారీ ప్రాజెక్ట్ సెట్ చేసాడు సరే.. ఆ దర్శకుడిని ఎలా డీల్ చేస్తాడు?
X
దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించనున్నారు. ఇది చరణ్ కెరీర్ లో 15వ సినిమా.. దిల్ రాజు బ్యానర్ లో 50వ చిత్రం కావడం విశేషం. 'షోమ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా' శంకర్ - రామ్ చరణ్ వంటి రెండు శక్తుల కలయికలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే శంకర్ లాంటి భారీ చిత్రాల దర్శకుడిని దిల్ రాజు ఎలా హ్యాండిల్ చేయగలడని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

డైరెక్టర్ శంకర్ ఎలాంటి సినిమా చేసినా అభిమానుల అంచనాలను అందుకునేలా భారీ స్థాయిలో ఉండాలని భారీగా ఖర్చు చేస్తాడని అందరికి తెలిసిందే. కేవలం సాంగ్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాడు. సౌత్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు శ్రీకారం చుట్టిందే ఆయన. ఫస్ట్ సినిమా నుంచి కూడా శంకర్ సినిమా బడ్జెట్ పెరుగుతూనే ఉంది గాని ఏ మాత్రం తగ్గలేదు. అదే సమయంలో శంకర్ సినిమా అంటే ఎప్పుడూ నిర్మాతలతో బడ్జెట్ ఇష్యూ ఉంటుంది. శంక‌ర్‌ తో సినిమా చేస్తూ.. ఇబ్బందులు ప‌డిన నిర్మాత‌లు ఎంతో మంది ఉన్నారు. 'ఇండియన్ 2' సినిమా కూడా హై బడ్జెట్ కారణంగానే నిలిపివేశారనే టాక్ ఉంది. అలాంటిది ఇప్పుడు శంకర్ తో సినిమా చేయడానికి సిద్దమైన దిల్ రాజు ఆయన్ని ఎలా డీల్ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.

దిల్ రాజు సినిమా అంటేనే ప‌క్కా ప్లానింగ్ తో వెళ్తుంటాయి. చెప్పిన బడ్జెట్ లో సినిమా కంప్లీట్ అయ్యేలా ప్రణాళిక చేసుకుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే అన్ని లెక్కలు వేసుకకుని సినిమా చేసే దిల్ రాజు.. ఎక్కువ సమయం తీసుకుంటూ భారీగా ఖర్చు చేసే శంకర్ ఇద్దరూ సినిమా మేకింగ్ లో వ్యతిరేక దృవాలని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో శంకర్ ని దిల్ రాజు ఎలా కంట్రోల్ చేస్తాడు అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇప్పటికే ఈ కాంబోపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. దిల్ రాజు 150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు.. ఇది సాంగ్స్ కి సరిపోతుంది అని శంకర్ అంటున్నట్లుగా మీమ్స్ పెడుతున్నారు. అందులోనూ ఇది సైన్స్ ఫిక్షనల్ జోనర్ లో రూపొందే సినిమా అనే టాక్ ఉంది. మరి గ‌త అనుభ‌వాలను దృష్టిలో పెట్టుకొని శంక‌ర్ ని దిల్ రాజు ఎలా డీల్ చేస్తాడో చూడాలి.