Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి వచ్చేస్తున్న పాన్ ఇండియా డిజాస్టర్ మూవీ..?

By:  Tupaki Desk   |   20 Sep 2022 8:07 AM GMT
ఓటీటీలోకి వచ్చేస్తున్న పాన్ ఇండియా డిజాస్టర్ మూవీ..?
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా "లైగర్". భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రాన్ని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలడమే కాదు.. అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు బాగా నష్టపోయేలా చేసింది.

థియేట్రికల్ రిలీజ్ లో ఘోర పరాజయం చవిచూసిన 'లైగర్' సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

అయితే 'లైగర్' సినిమాకు సంబంధించిన నాలుగు దక్షిణాది వెర్సన్స్ మాత్రమే ముందుగా డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తారట. ఈ గురువారం అర్ధరాత్రి నుంచి తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తారట. హిందీ డిజిటల్ ప్రీమియర్ తర్వాత ప్రసారం అవుతుందని అంటున్నారు.

'లైగర్' సినిమాకు భారీ ఓటీటీ డీల్ కుదిరిందని టాక్. తెలుగు - హిందీతో పాటు అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ ను స్టార్ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

'లైగర్' చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అంతకంటే ముందుగానే సెప్టెంబర్ 22న విడుదల చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వస్తున్నట్లు.

టాలీవుడ్ లో ఏ సినిమా అయినా 50 రోజుల తర్వాతే డిజిటల్ వేదిక మీదకు వచ్చేలా ఇటీవల కొత్త రూల్స్ తీసుకొచ్చారు. కాకపోతే అంతకంటే ముందుగా డీల్స్ కుదుర్చుకున్న సినిమాలకు ఈ నిబంధనలు వర్తించవు. ఇప్పుడు 'లైగర్' మూవీ కూడా ఈ కోవలోకే వస్తుందని అంటున్నారు. మరి ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.

కాగా, 'లైగర్' అనేది విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రంలో ఎంఎంఏ ఫైటర్ గా వీడీ కనిపించాడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా.. మైక్ టైసన్ - రమ్యకృష్ణ - రోనీత్ రాయ్ - విషు రెడ్డి - గెటప్ శీను - అలీ కీలక పాత్రలు పోషించారు.

ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్ - ఛార్మీ కౌర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం మల్టిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. కెచా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.