Begin typing your search above and press return to search.

ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ కు అల్లు అరవింద్ మరో ఛాన్స్‌

By:  Tupaki Desk   |   13 Aug 2021 8:55 AM IST
ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ కు అల్లు అరవింద్ మరో ఛాన్స్‌
X
గత ఏడాది కరోనాకు ముందు పలాస అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా అల్లు అరవింద్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. సినిమాను చూసిన ఆయన అక్కడే పలాస దర్శకుడు కరుణ కుమార్ కు అడ్వాన్స్ ఇచ్చాడు. గీతా ఆర్ట్స్‌ కోసం సినిమా చేయాలంటూ మీడియా ముందు అడిగేశాడు. అడ్వాన్స్ తీసుకున్న కరుణ కుమార్ ఇప్పటికే ఆహా కోసం మెట్రో కథలు అనే విభిన్నమైన వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కించాడు. ఆ వెబ్‌ సిరీస్ ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించింది. ఆ వెబ్‌ సిరీస్ తర్వాత సుధీర్ బాబుతో శ్రీదేవి సోడ సెంటర్ ను తెరకెక్కించాడు. భారీ బజ్‌ ఉన్న ఆ సినిమా తర్వాత కరుణ కుమార్‌ మరోసారి గీతా ఆర్ట్స్‌ లో చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇప్పటికే వెబ్‌ సిరీస్ ను అల్లు అరవింద్ నిర్మాణంలో చేసిన దర్శకుడు కరుణ కుమార్ ఈసారి ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినీ వర్గాల ద్వార అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అరవింద్‌ చాలా ఇష్టపడి మలయాళం మూవీ నయట్టు అనే సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. ఆ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను కరుణ కుమార్‌ దర్శకత్వంలో చేసే విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దర్శశకుడు కరుణ కుమార్‌ వద్ద చాలా కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ స్క్రిప్ట్స్ ఉన్నాయట. కాని అల్లు వారు మాత్రం నయట్టు సినిమా విషయమై చాలా ఆసక్తిగా ఉన్నారని.. ఆ రీమేక్‌ ను చేయాలని.. అది కూడా కరుణ దర్శకత్వంలో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక నయట్టు సినిమా విషయానికి వస్తే ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీ. ఈ సినిమా కథ ముగ్గురు పోలీసుల చుట్టు తిరుగుతూ ఉంటుంది. యంగ్‌ హీరోలు ఈ సినిమాలో ఉండరు. ఒక మర్డర్‌ కేసుకు సంబంధించిన కథ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ గా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా కొనసాగుతుంది. తెలుగు లో ఈ సినిమాకు తప్పకుండా మంచి టాక్ వస్తుందనే నమ్మకంతో అల్లు అరవింద్ ఉన్నాడు. మొదట డబ్బింగ్‌ వర్షన్ ను ఆహా లో వదలాలి అనుకున్న అల్లు అరవింద్ రావు రమేష్‌.. అంజలి.. సత్యదేవ్‌ లేదా శ్రీవిష్ణు వంటి ట్యాలెంటెడ్‌ నటీ నటులతో సినిమా చేస్తే తప్పకుండా మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. ఒక లో బడ్జెట్‌ మూవీగా సింపుల్ గా ఈ సినిమాను రెండు మూడు నెలల్లోనే ముగించేలా అల్లు అరవింద్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.