Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఇది పక్కా కమర్షియల్ సినిమాయే..!

By:  Tupaki Desk   |   8 Nov 2021 12:56 PM GMT
టీజర్ టాక్: ఇది పక్కా కమర్షియల్ సినిమాయే..!
X
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ - గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా జంటగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. ఇందులో లాయర్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. మారుతి - గోపిచంద్‌ కాంబినేషన్ లో సినిమా అనగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - స్పెషల్ పోస్టర్స్ - ఫస్ట్ గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

'పక్కా కమర్షియల్' సినిమా గోపీచంద్ మార్క్ యాక్షన్ మరియు మారుతి తరహా కామెడీ ఎంటర్టైన్మెంట్ కలబోసిన కమర్షియల్ కోర్టు డ్రామా అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఊర మాస్ ఫైట్స్ తో పాటుగా స్టైలిష్ యాక్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. గోపీచంద్ లాయర్ పాత్రలో చాలా యంగ్ గా కొత్తగా కనిపించారు. 'ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు.. నేను ఎప్పుడో చూసి చేసి వచ్చేశాను.. అలాగే నా హీరోయిజంకి ఓ ఆరా ఉంటుంది.. కాన్సెన్ట్రేట్ చేస్తే ఆ ఆరా నుంచి ఒక ఆర్ ఆర్ వినిపిస్తుంది. ఇమేజిన్ చేసుకోండి కిక్కాస్ ఉంటుంది' అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

'ఇక్కడ ఈ ఎక్స్ ప్రెషన్ పెట్టకూడదు' అంటూ రాశీఖన్నా చేసిన అభినయం అలరిస్తోంది. 'జిల్' తర్వాత గోపీచంద్ - రాశీ కలిసి నటిస్తోన్న సినిమా ఇది. సీనియర్ నటుడు సత్యరాజ్ - రావు రమేష్ - సప్తగిరి - హర్ష తదితరులు ఈ టీజర్ లో భాగం అయ్యారు. జేక్స్ బిజోయ్సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ - కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. బాబు ఎడిటర్ గా వర్క్ చేశారు. మొత్తం మీద కికాస్ పక్కా కమర్షియల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమాపై అంచనాలు పెంచేసింది.

'పక్కా కమర్షియల్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాస్ ఈ చిత్రానికి నిర్మాతగా.. SKN కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల 'సీటీమార్' సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన గోపీచంద్.. ఇప్పుడు మారుతి తో కలిసి ''పక్కా కమర్షియల్'' చిత్రంతో మరో కమర్షియల్ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.