Begin typing your search above and press return to search.

రాశీతో ఫుల్ స్వింగులో ఉన్న క‌మ‌ర్షియ‌ల్ బోయ్

By:  Tupaki Desk   |   10 Aug 2021 4:30 AM GMT
రాశీతో ఫుల్ స్వింగులో ఉన్న క‌మ‌ర్షియ‌ల్ బోయ్
X
మ్యాకో స్టార్ గోపిచంద్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`. రాశీఖ‌న్నా క‌థానాయిక‌.. 2021 అక్టోబ‌ర్ 1 న థియేట‌ర్ల‌లోకి రావాల్సి ఉంది. అయితే కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమా ఆల‌స్యం కానుంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

యువి క్రియేష‌న్స్ - జీఏ2 సంస్థ‌లు సంయ‌క్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` అన్న టైటిల్ కి త‌గ్గ‌ట్టే ప్ర‌తిదీ క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచించే యువ‌కుడి క‌థాంశ‌మిది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్... మ‌హానుభావుడు త‌ర‌హాలోనే కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. మారుతి మార్క్ నేరేష‌న్ తో ఆద్యంతం ఫ‌న్ ఎలిమెంట్స్ తో ఆక‌ట్టుకోనుంది.

ఇక రాశీ ఖన్నాతో క‌మ‌ర్షియ‌ల్ కుర్రాడి రొమాన్స్ కూడా అదే రేంజులో ఉండ‌నుంద‌ని తాజాగా లీకైన ఫోటో చెబుతోంది. గోపిచంద్ - రాశీ ఖ‌న్నా జంట‌పై ఓ పాట‌ను ప్ర‌స్తుతం చిత్రీక‌రిస్తున్నారు. జానీ మాస్ట‌ర్ ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆ ముగ్గురూ క‌లిసి ఉన్న ఫోటో తాజాగా వైర‌ల్ గా మారింది. ఆక్సిజ‌న్ చిత్రంలో గోపిచంద్ - రాశీఖ‌న్నా జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. జిల్ చిత్రంలోనూ ఈ జంట క‌నిపించింది. ప్ర‌స్తుతం ప‌క్కా క‌మ‌ర్సియ‌ల్ లో రొమాంటిక్ ల‌వ‌ర్స్ గా తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారు.