Begin typing your search above and press return to search.

దీపావళి స్పెషల్‌.. పక్కా కమర్షియల్ గా వచ్చేసింది

By:  Tupaki Desk   |   4 Nov 2021 11:41 AM GMT
దీపావళి స్పెషల్‌.. పక్కా కమర్షియల్ గా వచ్చేసింది
X
గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్‌ గా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పక్కా కమర్షియల్‌. ఇటీవలే మారుతి మంచి రోజులు వచ్చాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక వైపు ఆ సినిమా థియేటర్లలో సందడి చేస్తూనే ఉండగా మరో వైపు పక్కా కమర్షియల్‌ ను కూడా థియేటర్ల ద్వారా తీసుకు వచ్చేందుకు జెట్‌ స్పీడ్ తో సినిమాను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కరోనా వల్ల చాలా ఆలస్యం అయిన పక్కా కమర్షియల్‌ సినిమా నుండి అప్పుడే టీజర్ ను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దీపావళి సందర్బంగా ప్రకటించారు. పక్కా కమర్షియల్‌ లోని గోపీచంద్‌ ఫస్ట్‌ లుక్ ను రివీల్‌ చేస్తూ గ్లిమ్స్ ను విడుదల చేసి టీజర్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

టీజర్ ను ఈనెల 8న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా పక్కా కమర్షియల్‌ టీమ్‌ అధికారికంగా ప్రకటించారు. పెద్ద ఎత్తున అంచనాలున్న పక్కా కమర్షియల్‌ లో గోపీచంద్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందంటూ సమాచారం అందుతోంది. గోపీచంద్ సినిమా సక్సెస్‌ అయ్యి చాలా కాలం అయ్యింది అనుకుంటూ ఉన్న సమయంలో సిటీ మార్ తో సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఆ సక్సెస్‌ ను కంటిన్యూ చేసేలా పక్కా కమర్షియల్‌ ఉంటుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ వారు మరియు గీతాఆర్ట్స్ 2 వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇటీవల మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను నిర్మించి సక్సెస్‌ దక్కించుకున్న బన్నీ వాసు ఈ సినిమా పై చాలా ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి నిర్మిస్తున్నాడనే సమాచారం అందుతోంది. బన్నీ వాసు గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా అల్లు అరవింద్ సమర్పకుడు.. పక్కా కమర్షియల్‌ స్క్రిప్ట్‌ అల్లు అరవింద్ కు బాగా నచ్చిందట. అందుకే బన్నీ వాసు నిర్మాణంలో సమర్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. ఈ సమయంలో టీజర్ ను విడుదల చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా కథ ఏంటీ.. హీరో పాత్ర ఏంటీ అనే విషయాలను కాస్త రివీల్‌ చేసే విధంగా టీజర్ ఉంటుందని మేకర్స్ అనధికారికంగా చెబుతూ వస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది టీజర్‌ విడుదల అయితే కాని తెలిసే అవకాశం లేదు.