Begin typing your search above and press return to search.

మేలో సోలోగా వస్తున్న పక్కా కమర్షియల్..!

By:  Tupaki Desk   |   1 Feb 2022 1:36 PM GMT
మేలో సోలోగా వస్తున్న పక్కా కమర్షియల్..!
X
కరోనా నేపథ్యంలో సమ్మర్ రిలీజులలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంక్రాంతి సీజన్ కు ముందు ఎలాగైతే హంగామా జరిగిందో.. ఇప్పుడు అదే విధంగా సమ్మర్ కు ముందు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. 'ఆర్.ఆర్.ఆర్' మూవీ విడుదల తేదీని ప్రకటించడంతో దానికి తగ్గట్టుగా మిగతా చిత్రాలన్నీ రిలీజ్ డేట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'పక్కా కమర్షియల్' సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసారని తెలుస్తోంది.

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ - రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 2022 మే 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. పెద్ద సినిమాల హడావిడి అంతా పోయిన తర్వాత సమ్మర్ సీజన్ ఎండింగ్ లో రావడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశమనే అనుకోవాలి.

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. బ‌న్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి SKN సహ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నారు. అతని క్యారెక్టర్ ను మారుతి సరికొత్తగా డిజైన్ చేయడమే కాదు.. స్టైలిష్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. సీనియర్ నటుడు సత్యరాజ్ - రావు రమేష్ - సప్తగిరి - హర్ష తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన 'పక్కా కమర్షియల్' ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో దివంగత లెజండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన టైటిల్ సాంగ్ ను ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ చేయనున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రవీందర్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్బీ ఉద్ధవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'సీటీమార్' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత గోపీచంద్ నుంచి వస్తున్న ఈ చిత్రం ఎలాంటి కమర్షియల్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.