Begin typing your search above and press return to search.

మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న 'పక్కా కమర్షియల్'..!

By:  Tupaki Desk   |   4 July 2022 8:19 AM GMT
మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న పక్కా కమర్షియల్..!
X
మ్యాచో హీరో గోపీచంద్ మరియు విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''పక్కా కమర్షియల్''. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉండటం విశేషం.

'పక్కా కమర్షియల్' సినిమా తొలి రోజు 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శని ఆది వారాలను బాగానే క్యాష్ చేసుకోవడంతో.. ఈ సినిమా రెండు రోజుల్లో 10.5 కోట్లు.. మూడు రోజుల్లో 15.2 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలిపారు.

ఓవరాల్ గా 'పక్కా కమర్షియల్' సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని.. మూడు రోజుల్లోనే సేఫ్ అయిపోయిందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం పబ్లిసిటీతో కలుపుకొని నిర్మాతలు దాదాపు రూ. 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని సమాచారం.

అందులో డిజిటల్ - శాటిలైట్ - హిందీ రీమేక్ రైట్స్ మరియు డబ్బింగ్ హక్కులు కలుపుకొని కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ. 32 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అందుకే 'పక్కా కమర్షియల్' సినిమా ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుందని అర్థమవుతోంది. ఫస్ట్ వీకెండ్ ని క్యాష్ చేసుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.

కాగా, 'పక్కా కమర్షియల్' సినిమాలో గోపీచంద్ లాయర్ గా చాలా స్టైలిష్ గా కనిపించారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా.. ఆమె క్యారెక్టర్ ను చాలా ఫన్నీగా డిజైన్ చేసాడు మారుతి. స‌త్య‌రాజ్ - రావు ర‌మేశ్ - సప్తగిరి - శ్రీనివాస్ రెడ్డి - ప్రవీణ్ - వైవా హర్ష తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ - శియా - చిత్ర శుక్లా ప్రత్యేక పాత్రలో మెరిసారు.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. SKN - బాబు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్బీ ఉద్ధవ్ ఎడిటర్ గా.. ఆర్ రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.