Begin typing your search above and press return to search.

పాక్ బంగ్లా లంకలో కూడా మన మేజర్‌ నెం.1

By:  Tupaki Desk   |   8 July 2022 6:02 AM GMT
పాక్ బంగ్లా లంకలో కూడా మన మేజర్‌ నెం.1
X
అడవి శేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మేజర్‌ సినిమా థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ అయ్యి మంచి స్పందన దక్కించుకుంది. గత నెలలో విడుదల అయిన మేజర్ సినిమా కు కమర్షియల్‌ గా మంచి స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయి. ఒక కమర్షియల్‌ సినిమా కాకున్నా కూడా మేజర్ ను జనాలు ఎక్కువ శాతం ఆదరించిన తీరు నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

దేశవ్యాప్తంగా కూడా మేజర్ సినిమా సాధించిన వసూళ్ల నేపథ్యంలో ఇలాంటి సినిమాలను జనాలు ఎంతగా ఆదరిస్తారో మరోసారి నిరూపితం అయ్యింది. రియల్‌ హీరో మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మేజర్ సినిమా ను తాజాగా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో ఈ సినిమా సౌత్‌ లో అన్ని భాషలతో పాటు హిందీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు వర్షన్‌ తో పాటు హిందీ వర్షన్ కు కూడా మంచి స్పందన వస్తోంది. తెలుగు మరియు హిందీ వర్షన్ లు టాప్ లో ట్రెండ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్ మేజర్‌ సినిమా ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌.. శ్రీలంక లో కూడా ట్రెండ్‌ అవుతున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ ద్వారా తెలుస్తోంది.

ఒకే సినిమా ఇన్ని దేశాల్లో ట్రెండ్‌ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. హాలీవుడ్‌ సినిమాలు వెబ్‌ సిరీస్ లు ఇలా ట్రెండ్‌ అవ్వడం జరుగుతుంది. కాని ఈ సినిమా పలు దేశాల్లో ట్రెండ్‌ అవ్వడం నిజంగా అద్భుతం. ఈమద్య కాలంలో సౌత్‌ సినిమాలు ఏ స్థాయిలో సందడి చేస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

మేజర్ సినిమా కు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా అడవి శేష్‌ తన పాత్రకు జీవం పోషినట్లుగా నటించాడు. నిజంగా మేజర్ ఉన్ని కృష్ణన్‌ ను చూస్తున్నామా అన్నట్లుగా సినిమాలో ఆయన నటన ఉందంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు.

ఇండియాపై ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను పాకిస్తాన్ మరియు బంగ్లా దేశీయులు అధికంగా నెట్‌ ఫ్లిక్స్ ద్వారా చూడటం ఒకింత ఆశ్చర్యంగా ఉంది.