Begin typing your search above and press return to search.

నైట్ పార్టీ: మ‌హేష్ ఫ్యామిలీతో పైడిప‌ల్లి సెల‌బ్రేష‌న్

By:  Tupaki Desk   |   31 Dec 2021 4:40 AM GMT
నైట్ పార్టీ: మ‌హేష్ ఫ్యామిలీతో పైడిప‌ల్లి సెల‌బ్రేష‌న్
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ కుటుంబంతో ప్ర‌స్తుతం పైడిప‌ల్లి ఫ్యామిలీ దుబాయ్ సెల‌బ్రేష‌న్ లో ఫుల్ చిలౌట్ అవుతోంది. డిసెంబ‌ర్ 31 మిడ్ నైట్ పార్టీ మొద‌లు జ‌న‌వ‌రి తొలివారంలో దుబాయ్ లోనే ఈ కుటుంబాలు సెల‌బ్రేట్ చేయ‌నున్నాయి. ఆ మేర‌కు తాజాగా పైడిప‌ల్లి .. మ‌హేష్ ఫ్యామిలీస్ సెల్ఫీల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. 2021 కి బాయ్ చెబుతూ 2022కి వెల్కం చెప్పేందుకు ఇరు కుటుంబాలు ఇలా ప్లాన్ చేశాయి. గ‌త ఏడాది కూడా జ‌న‌వ‌రి 1 వేడుక‌ల కోసం మ‌హేష్ - పైడిప‌ల్లి కుటుంబాలు క‌లిసి దుబాయ్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ఇది గొప్ప స్నేహానుబంధం..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కుటుంబంతో డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి స్నేహానుబంధం గురించి తెలిసిందే. మ‌హేష్ - న‌మ్ర‌త దంప‌తుల‌తో పైడిప‌ల్లి - మాలిని పైడిప‌ల్లి ఎంతో క్లోజ్ గా ఉంటారు. ఈ జంట‌ల వార‌సురాళ్లు సితార‌-ఆద్య కూడా యూట్యూబ్ చానెల్ ని ప్రారంభించి అంత‌ర్జాలంలో దూసుకెళ్లారు. ఏ అండ్ ఎస్ పేరుతో ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో బోలెడంత ప్ర‌మోష‌న్ ద‌క్కించుకున్నారు. ఇక విదేశీ వెకేష‌న్స్ కి కానీ హైద‌రాబాద్ లో డిన్న‌ర్ డేట్ కి కానీ ఈ ఇరు కుటుంబాలు క‌లిసి వెళుతుంటాయి. సరదా సాయంత్రాలు.. మంచి సమయాలు!! ఆస్వాధించ‌డం ఈ కుటుంబాల‌కు నిత్య‌వ్యాప‌కం.

మ‌హేష్ తో మూవీ ఎప్పుడు?

'మ‌హ‌ర్షి' చిత్రంతో ఘ‌న‌విజ‌యం అందుకున్న మ‌హేష్‌-పైడిపల్లి జోడీ మ‌రో సినిమా చేయాల‌న్న ప్లాన్ తో ఉన్నారు. కానీ స్క్రిప్ట్ ప‌రంగా వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌ర్వాత పైడిప‌ల్లి త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ తో ప‌ని చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మ‌హేష్ `స‌ర్కార్ వారి పాట`ను ముగించి ప్రస్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ త‌ర్వాత పైడిప‌ల్లితో ప‌ని చేసే అవ‌కాశం ఉంది. అప్ప‌టికి పైడిప‌ల్లి ద‌ళ‌ప‌తి విజ‌య్ తో పాన్ ఇండియా సినిమాని పూర్తి చేసి మ‌హేష్ కోసం స్క్రిప్ట్ ని రెడీ చేస్తారు.