Begin typing your search above and press return to search.

మగాడితో మగాడు సెక్సా? ఒప్పుకోం!!

By:  Tupaki Desk   |   2 Aug 2017 10:11 AM GMT
మగాడితో మగాడు సెక్సా? ఒప్పుకోం!!
X
సెన్సార్ బోర్డు చీఫ్ ఫలాజ్ నీలాని ఇప్పుడు చిక్కులో పడ్డాడు. అతని చేస్తున్న వీరంగం ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఫిల్మ్ డైరెక్టర్ కు చిరాకు పుట్టిస్తుంది. కొన్ని సన్నివేశాలు సమాజనికి హానికరం అని చెబితే సరే అని సరిపెట్టుకోవచ్చు. కానీ సినిమానే విడుదల కాకుండా చేస్తే అది ఎంతవరకు సరైన పని అడుగుతున్నారు దేశంలో ఉన్న ఫిల్మ్ డైరెక్టర్లు అందరూ. ఇప్పుడు సినిమా వాళ్లే కాదు హై కోర్ట్ న్యాయవాదులు కూడా ప్రశ్నిస్తున్నారు సెన్సర్ బోర్డుని.

‘కా బాడీ స్కేప్స్’ అనే ఒక మలయాళం సినిమాను స్వలింగ సంపర్కం పై నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఏడాది కి పైగా అయ్యింది. అప్పటి నుండి ఎన్నిసార్లు సర్టిఫికేషన్ కోసం పంపిన సెన్సార్ బోర్డు ప్రమాణపత్రం ఇవ్వడానికి నిరాకిరించిందట. ఒక మీడియా రిపోర్ట్ ప్రకారం 18 మంది సభ్యులు గల CBF కమిటీ తిరువనంతపురం వెళ్ళి ‘కా బాడీ స్కేప్స్’ సినిమా చూసినట్లు తెలుస్తుంది. ఇలా కొన్ని నెలలు బట్టి సాగుతుంది అంట అయన కూడా ఫిల్మ్ ని ఓకే చేయకుండా రిజెక్ట్ చేస్తున్నారని దర్శకుడు జయన్ చెరియన్ అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా వివాదంలో భాగంగా సెన్సర్ బోర్డు చీఫ్ ఫలాజ్ నీలాని కేరళ కోర్ట్ నుండి ఒక నోటిస్ ను అందుకున్నారు. ఒక సినిమాకు దృవపత్రం ఇవ్వడానికి ఏడాది ఎందుకు పట్టిందో వివరణ ఇవ్వండి అని కేరళ హైకోర్ట్ ఒక నోటిస్ పంపింది.

కిందటి వారం కూడా CBFC నుండి పద్దెనిమిది సభ్యులు చూశారు. ఒక 9 మందికి నచ్చితే మరో 9 మంది విడుదలకు పనికిరాదు అని చెబుతున్నారు. అయితే సి‌బి‌ఎఫ్‌ సి తరుపున వాదించే లాయర్ రెండు వారాలు గడువు ఇవ్వండి అని కోర్ట్ ని కోరినట్లు తెలుస్తోంది. ఒక ముద్దు శృతి మించితేనే మన సెన్సార్ వాళ్ళు కట్ చేసి పారేస్తారు అలాంటిది ఇద్దరు మగవాళ్ళు సెక్స్ జీవితం పై ఒక సినిమా తీస్తే ఎలా వాళ్ళు ఒప్పుకుంటారు లెండి అంటున్నారు సామాన్య జనాలు.