Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్‌: దంగ‌ల్ గాళ్ `పాగ‌లైట్` వేషాలు

By:  Tupaki Desk   |   16 March 2021 7:33 AM GMT
ట్రైల‌ర్ టాక్‌: దంగ‌ల్ గాళ్ `పాగ‌లైట్` వేషాలు
X
ఆస్కార్ రేస్ వ‌ర‌కూ దూసుకెళ్లిన `లంచ్ బాక్స్` మేక‌ర్స్ నుంచి తాజాగా నెట్ ఫ్లిక్స్ మూవీ పాగ‌లైట్ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో దంగల్ ఫేం స‌న్యా మ‌ల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌ధారి.

బధాయ్ హో- శకుంతలా దేవి- లూడో వంటి సినిమాల‌తో మెరుపులు మెరిపించిన స‌న్యా ఇప్పుడు పాగ ‌లైట్ అనే మ‌హిళా ప్ర‌ధాన చిత్రంలో న‌టించింది. నెట్ ‌ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం ట్రైలర్ తాజాగా విడుద‌లైంది.

ట్రైల‌ర్ ఆద్యంతం భావోద్వేగాలతో నిండిన కామెడీ వినోదం ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రం సంధ్య అనే యువ‌తి జీవితం చుట్టూ తిరుగుతుంది. పెళ్ల‌యిన ఐదు నెల‌ల‌కు మరణిస్తాడు. అయినా ఆ మరణంతో సంధ్య కుంగిపోదు. మామూలుగా పనిచేస్తుంది. అటుపై ఎదురైన‌ కుటుంబ సమస్యలను ఎలా ప‌రిష్క‌రించుకుంది? అన్న‌దే ఇత‌ర క‌థాంశం.

సంఘంలో ఉన్న ఒక సీరియ‌స్ సమస్యను కామిక్ వేలో ద‌ర్శ‌కుడు చూపించారు. ఉమేష్ భిస్ట్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని శోభా కపూర్- ఏక్తా కపూర్- గునీత్ మొంగా- అచిత్ జైన్ నిర్మిస్తున్నారు. శ్రుతి శర్మ- సయాని గుప్తా- అశుతోష్ రానా- రఘుబీర్ యాదవ్ ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. పాగ‌‌లైట్ మార్చి 26న నెట్ ఫ్లిక్స్ ‌లో ప్రీమియ‌ర్ కి సిద్ధ‌మ‌వుతోంది.