Begin typing your search above and press return to search.

ఆర్య.. బన్నీ.. రాసిపెట్టుకోండి.. పాగల్‌ ను బాగా లేపేస్తున్నారు

By:  Tupaki Desk   |   12 Aug 2021 8:56 AM GMT
ఆర్య.. బన్నీ.. రాసిపెట్టుకోండి.. పాగల్‌ ను బాగా లేపేస్తున్నారు
X
విశ్వక్‌ సేన్‌ హీరోగా నివేథ పేతురాజ్ హీరోయిన్ గా నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన 'పాగల్‌' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. థియేటర్లు కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మూడు నెలల పాటు మూసే ఉన్నాయి. రెండు వారాల క్రితం తిమ్మరుసు మరియు ఇష్క్‌ సినిమాలతో థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి. తిమ్మరుసుకు సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చింది. కాని కరోనా భయంతో వసూళ్లు నిరాశ పర్చాయి. ఆ తర్వాత వచ్చిన ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయని టాక్. ఇక ముందు ముందు వచ్చే సినిమాలు పాజిటివ్ టాక్ దక్కించుకుంటే ఖచ్చితంగా భారీ గా వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పాగల్‌ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. సినిమా విడుదల సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విశ్వక్‌ సేన్ మాట్లాడుతూ అంచనాలు పెంచేశాడు. మూసి ఉన్న థియేటర్లు తెరిపిస్తాను.. రాసి పెట్టుకోండి పాగల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌.. అమ్మ తోడు ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం కూడా థియేటర్లు దద్దరిల్లేలా ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. విశ్వక్‌ సేన్‌ ఈ సినిమాపై ఉన్న నమ్మకం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అతడికి ఈ సినిమా మరో ఘన విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయంగా ఉంది.

అదే ప్రీ రిలీజ్ వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ కెరీర్‌ లో ఆర్య ఎలా అయితే నిలిచి పోయి స్టార్‌ గా నిలబెట్టిందో అలాగే విశ్వక్‌ సేన్‌ కు కూడా పాగల్‌ సినిమా నిలుస్తుంది. పాగల్‌ సినిమా చాలా ప్రత్యేకమైన సినిమా అంటూ దిల్‌ రాజు అభిప్రాయం వ్యక్తం చేశాడు. సాదారణంగా సినిమా కథ మరియు అన్ని విధాలుగా నచ్చితేనే దిల్‌ రాజు రంగంలోకి దిగుతాడు. బెక్కం వేణు గోపాల్‌ గతంలో నిర్మించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు. మొత్తానికి పాగల్ పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా లేపేస్తున్నారు. మరి అంచనాలకు ఈ సినిమా చేరువ అవుతుందా అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.