Begin typing your search above and press return to search.

భ‌న్సాలీపై అలిగిన ప‌ద్మావ‌తి.. ఏది నిజం?

By:  Tupaki Desk   |   26 May 2021 9:30 AM GMT
భ‌న్సాలీపై అలిగిన ప‌ద్మావ‌తి.. ఏది నిజం?
X
సంజ‌య్ లీలా భ‌న్స‌లీతో స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే స్నేహ‌సంబంధాల‌ గురించి తెలిసిందే. ఆ ఇరువురి క‌ల‌యిక‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు వ‌చ్చాయి. దీపిక టైటిల్ పాత్ర‌లో భ‌న్సాలీ తెర‌కెక్కించిన ప‌ద్మావ‌త్ 3డి సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. క‌ళాత్మ‌క చిత్రాల దర్శ‌కుడిగా భ‌న్సాలీ త‌న అభిమాన నాయిక దీపిక‌ను ఒక రేంజులోనే తెర‌పై చూపించారు. 600 కోట్ల క్ల‌బ్ సినిమాగా సంచ‌ల‌నాలు సృష్టించింది. అలాంటి అవ‌కాశం క‌ల్పించిన‌ దీపిక ఎంతో రుణ‌ప‌డి ఉండాలి. భన్సాలీ తెర‌కెక్కించిన‌ రామ్ లీలా- బాజీరావ్ మస్తానీ చిత్రాల్లోనూ దీపిక క‌థానాయిక. కానీ ఇప్పుడు భ‌న్సాలీపైనే దీపిక అలిగిందిట‌.

ప్ర‌స్తుతం దీపిక తో బైజు బావ్రా అనే మ‌రో సినిమాకి భ‌న్సాలీ స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని అయితే ఆ ప్రాజెక్ట్ కి నో చెప్పింద‌ని ప్ర‌చార‌మవుతోంది. ఈ చిత్రంలో దీపికను బందిపోటు రాణిగా చూపించ‌నున్నార‌ట‌. అయితే గంగూభాయి క‌తియావాడీ చిత్రంలో త‌న‌కు అవ‌కాశం క‌ల్పించ‌నందుకు దీపిక అనాస‌క్తిని క‌న‌బ‌రిచింద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇక ఆలియా న‌టిస్తున్న గంగూభాయిలో ఐటమ్ నంబ‌ర్ కోసం సంప్ర‌దిస్తే దీపిక భ‌న్సాలీ ప్ర‌పోజ‌ల్ కు నో చెప్పింద‌ని ప్ర‌చారం వేడెక్కిస్తోంది.

ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన గంగూబాయి కతియావాడి త్వరలో విడుదల కానుంది. తదుపరి భ‌న్సాలీ బైజు బావ్రాని చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ‌తారు. నిజానికి భ‌న్సాలీతో ఏ విభేధాలు లేవ‌ని ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటించడానికి భన్సాలీ ఆసక్తిగానే ఉందని తాజా నివేదిక పేర్కొంది.

ఏడాది కాలంగా ఈ స్క్రిప్ట్ ను భ‌న్సాలీ తీర్చిదిద్దుతున్నాడు. 1952 ఒరిజినల్ నుండి డాకోయిట్ రాణి రూపమతి పాత్రను భ‌న్సాలీ డిజైన్ చేశారు. ఇటీవ‌ల దీపిక‌తో ఈ చిత్రంలో త‌న‌ పాత్ర గురించి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతానికి ఇంకా రాత పని ఇంకా పూర్తి కాలేదు. 2022 మిడిల్ లో చిత్రీక‌ర‌ణ‌కు వెళ‌తార‌ని భావిస్తున్నారు. దీపిక స‌హా ఇతర నటులతో చ‌ర్చ‌లు కూడా పురోగతిలో ఉన్నాయి. భన్సాలీ కోరుకునే మొత్తం తారాగణం ఎంపిక పూర్త‌య్యాక‌ అధికారిక ప్రకటన వస్తుంది అని తెలిసింది.