Begin typing your search above and press return to search.

‘బాహుబలి’ విలువను తగ్గించేస్తుందా?

By:  Tupaki Desk   |   10 Oct 2017 5:30 PM GMT
‘బాహుబలి’ విలువను తగ్గించేస్తుందా?
X
చడీచప్పుడు లేకుండా నిన్న ‘పద్మావతి’ ట్రైలర్ లాంచ్ చేసేశాడు సంజయ్ లీలా బన్సాలీ. సెట్స్ మీదికి వెళ్లినప్పటి నుంచి లేని పోని వివాదాలు, నెగెటివ్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు.. కంటెంట్‌ తో చర్చనీయాంశమవుతోంది. ట్రైలర్లో కళ్లు చెదిరే ఆ విజువల్స్.. స్టన్నింగ్ మ్యూజిక్.. నటీనటుల అద్భుత అభినయం.. ఆకర్షణీయమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ చూశాక ఇది ‘బాహుబలి’ని మించే సినిమా అవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ‘బాహుబలి’లా వసూళ్లు సాధించడం.. జనాలకు రీచ్ కావడం ‘పద్మావతి’కి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి మ్యాజిక్ ‘పద్మావతి’కే కాదు.. రాజమౌళి తీసే మరో సినిమాకు కూడా అది కష్టసాధ్యమే.

ఐతే వసూళ్లు.. భారీతనం సంగతలా పక్కన పెడితే.. కంటెంట్ పరంగా మాత్రం ‘పద్మావతి’ రాజమౌళి విజువల్ వండర్ ను దాటేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సంజయ్ లీలా బన్సాలీ ఇంతకుముందు తీసిన ‘బాజీరావు మస్తానీ’ కూడా కంటెంట్ పరంగా బలంగానే కనిపించింది. గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. ‘పద్మావతి’ దాని కంటే ఒక మెట్టు పైనే ఉండేలా ఉంది. ‘బాజీరావు..’ తీసిన అనుభవంతో బన్సాలీ ఈసారి మరింత మంచి ఔట్ పుట్ తీసుకొచ్చినట్లున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్.. సెట్టింగ్స్.. కాస్ట్యూమ్స్.. అన్నీ కూడా ‘పద్మావతి’లో గొప్పగా అనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లోనూ ఒక పర్ఫెక్షన్ కనిపిస్తోంది ట్రైలర్ చూస్తే. ట్రైలర్ చూశాక జనాల్లో కలిగిన అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటే.. ‘పద్మావతి’ కంటెంట్ విషయంలో ‘బాహుబలి’ని విలువను తగ్గించేయడం ఖాయం.